Virat Kohli New Look: బాలీవుడ్ హీరోల్లా క్లాసిక్ డెనిమ్ లుక్‌లో విరాట్ కోహ్లీ, మీరూ ట్రై చేయండి!-cricketer virat kohli looks really good as he pulls off a cool denim look ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Virat Kohli New Look: బాలీవుడ్ హీరోల్లా క్లాసిక్ డెనిమ్ లుక్‌లో విరాట్ కోహ్లీ, మీరూ ట్రై చేయండి!

Virat Kohli New Look: బాలీవుడ్ హీరోల్లా క్లాసిక్ డెనిమ్ లుక్‌లో విరాట్ కోహ్లీ, మీరూ ట్రై చేయండి!

Galeti Rajendra HT Telugu

Cricketer Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో సరికొత్త లుక్‌లో కనిపించాడు. బాలీవుడ్ హీరోలు ఫాలో అవుతున్నడెనిమ్ లుక్‌లో కోహ్లీ దర్శనమిచ్చాడు.

విరాట్ కోహ్లీ

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో క్లాసిక్ డెనిమ్ లుక్‌లో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా బాలీవుడ్ హీరోలు ఈ డెనిమ్ లుక్‌ను ఫాలో అవుతుంటారు. కానీ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం ముంబయి నుంచి బెంగళూరుకి వెళ్తున్న విరాట్ కోహ్లీ డెనిమ్ లుక్‌లో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేశాడు.

కొత్త లుక్‌లోకి కోహ్లీ

డెనిమ్ లుక్ దుస్తులు ప్రయాణానికి బాగా సరిపోతాయి. విరాట్ కోహ్లీ బ్లూ డెనిమ్ షర్ట్, ప్యాంట్‌తో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించాడు. ఆ లుక్‌కి మరింత క్లాసిక్ లుక్ జోడించడానికి ఆ డెనిమ్ షర్ట్ కింద వైట్ కలర్ టీ షర్ట్ కూడా విరాట్ కోహ్లీ ధరించి బ్లాక్ కూలింగ్ గ్లాస్ ధరించాడు.

డెనిమ్ లుక్‌లో బాలీవుడ్ సెలెబ్రిటీలు

ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు కూల్ డెనిమ్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తరచుగా ఇలాంటి రంగులలో జీన్స్ జత చేసిన స్టైలిష్ డెనిమ్ జాకెట్లలోకనిపిస్తున్నాడు. అలానే మరో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ కనిపించినా డెనిమ్ జాకెట్‌లోనే దర్శనమిస్తున్నాడు. ఎయిర్ పోర్టులో, సినిమా థియేటర్లలో, బయట తిరిగేటప్పుడు కూడా జాకెట్ అండ్ జీన్స్ లుక్‌లోనే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ ట్రెండ్‌ను విరాట్ కోహ్లీ కూడా ఫాలో అవుతున్నాడు.

భారత్, న్యూజిలాండ్ మధ్య సిరీస్ షెడ్యూల్

భారత్, న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టెస్టు మ్యాచ్ బెంగళూరు వేదికగా అక్టోబరు 16 నుంచి ప్రారంభంకానుండగా.. ఆ తర్వాత రెండో టెస్టు మ్యాచ్ పుణె వేదికగా అక్టోబరు 24 నుంచి, మూడో టెస్టు మ్యాచ్ నవంబరు 1 నుంచి ముంబయి వేదికగా జరగనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే భారత్ జట్టుని బీసీసీఐ ప్రకటించింది. ఈ టీమ్‌లోకి ఎంపికైన విరాట్ కోహ్లీ.. తొలి టెస్టు కోసం బెంగళూరుకి వెళ్లాడు.