Virat Kohli: ఎయిర్‌పోర్ట్‌లో అభిమాని మాటకి షాకైన విరాట్ కోహ్లీ, అమాయకంగా రిప్లై!
న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం విదేశీ పర్యటన నుంచి ముంబయికి విరాట్ కోహ్లీ తిరిగొచ్చేశాడు. ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌ను ఆడునుంది.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముంగిట వెకేషన్‌ను ముగించుకుని భారత్‌లో విరాట్ కోహ్లీ అడుగుపెట్టాడు. ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి విరాట్ కోహ్లీ వెళ్తుండగా.. ఓ అభిమాని మాట్లాడిన మాటలకి కాస్త షాక్‌కి గురైన విరాట్ కోహ్లీ అమాయకంగా ప్రశ్నించి వేగంగా కారు ఎక్కి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత్ గడ్డపై అక్టోబర్ 16 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత విదేశాలకి విహారయాత్రకి వెళ్లిపోయాడు. కివీస్‌తో సిరీస్‌కి భారత సెలెక్టర్లు త్వరలోనే జట్టుని ఎంపిక చేయనున్నారు.
భారత్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. కానీ.. టీ20 వరల్డ్‌కప్ -2024తో టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే.
భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్
తొలి టెస్టు: అక్టోబర్ 16 నుంచి 20 వరకు (బెంగళూరులో)
రెండో టెస్టు: అక్టోబర్ 24 నుంచి 28 వరకు (పుణెలో)
మూడో టెస్టు: నవంబర్ 1 నుంచి 5 (ముంబయిలో)
కోహ్లీ ఫైర్ అవ్వాలి
ముంబయి ఎయిర్ పోర్టులో విరాట్ కోహ్లీతో కొందరు అభిమానులు ఫొటోలు దిగగా, మరికొందరు అతడితో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతా సిబ్బంది అక్కడ ఉన్న అభిమానుల్ని పక్కకి తోసేస్తూ కోహ్లీకి దారిని క్లియర్ చేశారు.
ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ బయటికి వెళ్తున్న విరాట్ కోహ్లీకి వినపడేలా ఓ అభిమాని బిగ్గరగా.. ‘‘కోహ్లీ నువ్వు కాల్చేయాలి’’ అని అరిచాడు. దాంతో అర్థంకానట్లు ఒక్క క్షణం ఆగిన విరాట్ కోహ్లీ ‘‘ఎక్కడ నేను కాల్చాలి’’ అని అమాయకంగా ప్రశ్నించాడు. దాంతో అభిమాని తిరిగి బీజీటీ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ)లో నువ్వు ఫైర్ అవ్వాలి అని సమాధానమిచ్చాడు. ఆ మాట విన్న కోహ్లీ కారు ఎక్కి వెళ్లిపోయాడు.
ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. కానీ.. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో మాత్రం ఆడాడు. అయితే సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో మ్యాచ్ లో 76 పరుగులు చేశాడు.
శ్రీలంకపై చేతిలో ఇటీవల 0-2 తేడాతో ఓడిపోయిన న్యూజిలాండ్ టీమ్ ఇప్పుడు ఒత్తిడిలో ఉంది. ఓటములకి బాధ్యత వహిస్తూ టిమ్ సౌథీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టామ్ లాథమ్ చేతికి పగ్గాలు వచ్చాయి.