మంచి తండ్రి కావడానికి రణబీర్ కపూర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న రణ్‌వీర్ సింగ్-ranveer singh is taking training from ranbir kapoor to become a good father ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranveer Singh Is Taking Training From Ranbir Kapoor To Become A Good Father

మంచి తండ్రి కావడానికి రణబీర్ కపూర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న రణ్‌వీర్ సింగ్

HT Telugu Desk HT Telugu
Mar 22, 2024 05:41 AM IST

రణవీర్ సింగ్ మంచి భర్తగా మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు ఇక అంతే మంచి తండ్రిగా కూడా ఉండాలనుకుంటున్నాడు. రణ్‌వీర్ తన రాబోయే బిడ్డ గురించి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు.

రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్
రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్

రణబీర్ కపూర్ తన కుమార్తె రాహాను చాలా ప్రేమిస్తాడు. అభిమానులు దీనిని చాలాసార్లు గుర్తించారు. అతను దాదాపు ప్రతి ఇంటర్వ్యూలో తన కుమార్తె గురించి మాట్లాడుతూ కనిపిస్తాడు. తన గారాలపట్టితో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాడు. రణబీర్ మంచి తండ్రిగా మారడం చూసి ఇప్పుడు రణవీర్ సింగ్ కూడా అతని వద్ద శిక్షణ పొందుతున్నాడు. ఎందుకంటే అతను కూడా త్వరలో ఈ జర్నీని ఎంజాయ్ చేయబోతున్నాడు. రణవీర్ మరియు దీపికా పదుకొనే దంపతులు తాము సెప్టెంబరులో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించారు.

రణ్‌వీర్‌ని ఆకట్టుకున్న రణ్‌‌బీర్

బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్స్ ప్రకారం, తండ్రి కావడానికి ముందు రణవీర్ మంచి తండ్రిగా శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాడు. ఇటీవల రణవీర్ అంబానీ కుటుంబ వేడుక సందర్భంగా రణ్‌బీర్‌ను కలిసినప్పుడు తండ్రిగా అతడి ప్రయాణం ఆకట్టుకుంది. వారిద్దరూ ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. ఇద్దరూ పిల్లల గురించే మాట్లాడుకున్నారు. రణబీర్ తన కూతురు రాహాను చూసుకుంటున్న తీరు చూసి రణ్‌వీర్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడట.

సుదీర్ఘ విరామం

బిడ్డ పుట్టాక రణ్‌వీర్ సుదీర్ఘ విరామం తీసుకుంటాడని వార్తలు వచ్చాయి. దీపిక కూడా ఇప్పటికే తన పనులన్నీ పూర్తి చేసిందని సమాచారం. బైజు బావ్రా తర్వాత రణ‌్‌వీర్ సుదీర్ఘ విరామం తీసుకుంటాడు. దీపిక, బిడ్డతో గడపనున్నాడు. విరామం తర్వాత అతను డాన్ 3, శక్తిమాన్ చిత్రాల షూటింగ్‌‌లో పాల్గొంటారు.

దీపిక సినిమాలు ఇవే

దీపిక ఇప్పుడు కల్కి 2898 AD చిత్రంలో కనిపించబోతోంది. ఈ చిత్రంలో దీపికతో పాటు ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, దీపికల జోడీని పెద్ద తెరపై చూడాలని అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. కాగా, దీపిక ఇప్పటికే బిగ్‌బితో పికూ సినిమా చేసింది.

IPL_Entry_Point