India vs New Zealand: న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ.. షమికి దక్కని చోటు
India vs New Zealand: న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఆస్ట్రేలియా టూర్ కు ముందు పేస్ బౌలర్ మహ్మద్ షమి ఈ సిరీస్ కు తిరిగి వస్తాడనుకున్నా అతనికి చోటు దక్కలేదు. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు.
India vs New Zealand: న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ కు ఇండియన్ టీమ్ ను అనౌన్స్ చేశారు. 15 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించారు. పేస్ బౌలర్ మహ్మద్ షమి తిరిగి వస్తాడని భావించినా.. అతనికి చోటు దక్కలేదు. మరోవైపు బుమ్రాను వైస్ కెప్టెన్ ను చేశారు.
న్యూజిలాండ్ సిరీస్‌కు టీమిండియా
న్యూజిలాండ్ తో అక్టోబర్ 16 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం పెద్దగా ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండా బంగ్లాదేశ్ తో ఆడిన జట్టునే అనౌన్స్ చేశారు. అయితే ఆ సిరీస్ లో ప్రత్యేకంగా వైస్ కెప్టెన్ లేకపోగా.. న్యూజిలాండ్ సిరీస్ కు ఆ బాధ్యతలను బుమ్రాకు అప్పగించారు.
15 మందితో కూడిన టీమ్ ను శుక్రవారం (అక్టోబర్ 11) సెలక్టర్లు ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో బుమ్రాను వైస్ కెప్టెన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో బుమ్రాను అందుకు సిద్ధం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.
బంగ్లాదేశ్ తో రెండో టీ20లో చెలరేగిపోయిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని ట్రావెలింగ్ రిజర్వ్ గా ఎంపిక చేశారు. అతనితోపాటు ప్రస్తుతం టీ20 జట్టులో ఉన్న మయాంక్ యాదవ్ కూడా రిజర్వ్ గా ఉండనున్నాడు. న్యూజిలాండ్ తో అక్టోబర్ 16న తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లే ముందు న్యూజిలాండ్ సిరీస్ కు పూర్తి ఫిట్ గా పేస్ బౌలర్ మహ్మద్ షమి వస్తాడని భావించారు. ప్రస్తుతం అతడు రీహ్యాబిలిటేషన్ లో ఉన్నాడు. అయితే షమిని ఎంపిక చేయకపోవడం చూస్తుంటే.. అతడు పూర్తి ఫిట్ నెస్ సంపాదించనట్లు తెలుస్తోంది. ఆ లెక్కన అతడు ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఉంటాడా లేదా అన్నది చూడాలి.
ఇండియన్ టీమ్ ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్, బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
రిజర్వ్ ప్లేయర్స్: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ