Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు
Ashwagandha powder: అశ్వగంధ చూర్ణాన్ని ఆయుర్వేదంలో ఒక అద్భుత మూలికగా చెబుతారు. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చు.
Ashwagandha powder: మనదేశంలో పురాతన వైద్య పద్ధతి ఆయుర్వేదం. ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైన మూలికలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అశ్వగంధ. అశ్వగంధను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అశ్వగంధ చూర్ణం మార్కెట్లో లభిస్తుంది. అలాగే క్యాప్సూల్స్ కూడా లభిస్తాయి. అశ్వగంధ చూర్ణాన్ని గోరువెచ్చటి పాలలో ఒక స్పూన్ వేసుకుని ప్రతిరోజూ తాగితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
మానసిక ఆరోగ్యానికి...
ఒత్తిడి... మానసిక ఆరోగ్యానికి కారణంగా మారుతుంది. అలాంటి మానసిక ఆందోళనలకు చెక్ పెట్టే శక్తి అశ్వగంధకు ఉంది. అశ్వగంధ కు ఆ పేరు రావడానికి కారణం దాని వాసనే. ఇది గుర్రం మూత్రంలా వాసన వస్తుంది. అందుకే దానికి అశ్వగంధ అనే పేరు పెట్టారు. అశ్వం అంటే గుర్రం, గంధ అంటే వాసన.
మగవారు ప్రతిరోజు పాలల్లో అశ్వగంధ చూర్ణాన్ని కలుపుకొని తాగడం వల్ల వారి లైంగిక శక్తి పెరుగుతుంది. శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగించడంలో కూడా అశ్వగంధ చూర్ణం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అశ్వగంధకు క్యాన్సర్ ను అడ్డుకునే శక్తిని కూడా కలిగి ఉంటుంది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు, ప్రతిరోజూ పాలల్లో అశ్వగంధ చూర్ణాన్ని కలిపి తాగితే ఎంతో మంచిది. కీళ్లవాతం, కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయి. మగవారిలో స్పెర్మ్ కణాల పెంపుదలకు ఇది సహాయపడుతుంది. చర్మాన్ని శుద్ధి చేస్తుంది. ముఖంపై వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
అశ్వగంధను ప్రతిరోజూ తాగలేని వారు రెండు మూడు రోజులకు ఒకసారైనా గోరువెచ్చటి పాలల్లో లేదా గోరువెచ్చటి నీళ్లల్లో వేసుకుని తాగడం మంచిది. ఇది అధిక రక్తపోటును మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అడ్డుకుంటుంది.
శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి అశ్వగంధ చూర్ణం ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసేందుకు అశ్వగంధ ముఖ్యం. గుండె ఆరోగ్యానికి అశ్వగంధ ఎంతో అవసరం. కొలెస్ట్రాల్ ను పేరుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ పెరగదో... రక్తనాళాల్లో రక్తం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. కాబట్టి గుండెపై ఎలాంటి ఒత్తిడి పడదు. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో బాధపడేవారు అశ్వగంధను తీసుకోవడం మంచిది.
తీవ్రమైన అలసట బారిన పడుతున్నవారు అశ్వగంధ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఒత్తిడి కలగకుండా ఉంటుంది. ఒత్తిడి కలిగించే హార్మోన్లను అడ్డుకోవడంలో అశ్వగంధ చూర్ణం మొదటి స్థానంలో ఉంటుంది. అలాగే జుట్టు ఊడిపోతున్నవారు అశ్వగంధను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. జుట్టు బాగా ఎదిగేందుకు అశ్వగంధలోని లక్షణాలు దోహదపడతాయి. అలాగే జుట్టు రంగు తెల్లగా మారకుండా కూడా ఇది అడ్డుకుంటుంది.
అశ్వగంధ ఎంతో మేలు చేస్తుంది... కాబట్టి ఎంత నచ్చితే అంత తినడానికి లేదు. ఇది శరీరానికి చాలా వేడి చేస్తుంది. కాబట్టి కేవలం రోజుకి ఒక స్పూను మాత్రమే తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లలో అయినా గోరువెచ్చటి పాలల్లో అయినా కలుపుకొని తాగవచ్చు.