Fruits On Empty Stomach। ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదేనా? నిపుణులు ఏమన్నారంటే..!
Eating Fruits On Empty Stomach: పండ్లను తినడానికి రోజులో నిర్దిష్ట సమయం ఉందా? ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.
Eating Fruits On Empty Stomach: పండ్లు తినడం చాలా ఆరోగ్యకరం అని మనందరికీ తెలుసు. కాలానుగుణంగా లభించే అన్ని పండ్లను తింటూ ఉండాలి. తాజా పండ్లు గొప్ప పోషక విలువలను కలిగి ఉంటాయి. అవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో నిండి ఉంటాయి. అయితే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందాలంటే పండ్లు ఎప్పుడు తినాలి? పండ్లను తినడానికి రోజులో నిర్దిష్ట సమయం ఉందా? ఖాళీ కడుపుతో పండ్లు తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు పండ్లలోని అన్ని పోషకాలు అందాలంటా, వాటి ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందాలనుకుంటే, ఉదయం ఖాళీ కడుపుతో పండ్లు తినాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇలా తినడం ద్వారా మీ శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటమిన్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు అందుతాయి. మీకు ఉదయాన్నే మంచి శక్తి లభిస్తుంది. క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో పండ్లు తినడం ద్వారా శరీర నిర్విషీకరణకు, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. న్యూట్రిషనిస్టుల ప్రకారం, ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల కలిగే కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అనేక పండ్లలో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది, అలాగే కొన్ని పండ్లలోని ఆమ్లాలు ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. ఖాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల మీరు తీసుకున్నటు వంటి ఇతర ఆహారాల పదార్థాలతో ఎలాంటి జోక్యం లేకుండా నేరుగా పండులోని అన్ని పోషకాలు, విటమిన్లను గ్రహించడానికి సహాయపడుతుంది.
2. శక్తి లభిస్తుంది
ఖాళీ కడుపుతో పండ్లను తినడం వల్ల త్వరగా శక్తిని పొందవచ్చు. పండ్లలో కార్బోహైడ్రేట్లతో నిండుగా ఉంటాయి, ఇవి శరీరానికి ఇంధనం అందించే ప్రధాన వనరు. ఉదయాన్నే పండ్లు తినడం ద్వారా మీకు ఉదయాన్నే కావలసిన శక్తి లభిస్తుంది. మీ రోజును ఆరోగ్యకరమైన రీతిలో ప్రారంభించడానికి సహాయపడుతుంది.
3. బరువు తగ్గవచ్చు
ఖాళీ కడుపుతో పండ్లు తినడం బరువు తగ్గడానికి గొప్ప మార్గం. అనేక రకాల పండ్లలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఉన్నప్పటికీ, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇది మీ ఆహారంలో అదనపు కేలరీలను చేర్చదు. పండు తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది రోజంతా మీరు అతిగా తినడం, చిరుతిళ్లు తినడం నివారించడాన్ని సులభతరం చేస్తుంది, ఈ రకంగా మీరు వేగంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.
4. మెరుగైన రక్తపోటు
ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల మీ రక్తపోటును నియంత్రించవచ్చు. కొన్ని పండ్లలో ఉండే సహజ చక్కెరలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి, అలాగే కొన్ని పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలు మీ అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
5. అందమైన చర్మం
ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల మీ చర్మం మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా మారుతుంది. పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడంలో సహాయపడతాయి, అదే సమయంలో మృదువైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. అలాగే, అనేక రకాల పండ్లలో సహజసిద్ధమైన యాంటీ ఇన్ల్ఫమేటరీలు గుణాలు ఉంటాయి, ఇవి చర్మంపై దద్దుర్లు, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి.
సంబంధిత కథనం