Body Detoxing Tea : బాడీని డిటాక్స్ చేయాలన్నా.. బరువు తగ్గాలన్నా.. ఈ టీలు బెస్ట్-body detoxing teas are good for health and they reduce fat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Body Detoxing Teas Are Good For Health And They Reduce Fat

Body Detoxing Tea : బాడీని డిటాక్స్ చేయాలన్నా.. బరువు తగ్గాలన్నా.. ఈ టీలు బెస్ట్

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 12, 2022 08:53 AM IST

Body Detoxing Tea : టీ అంటే చాలా మందికి ఇష్టం కానీ.. ఎక్కువ తాగకూడదు.. ఇవి హెల్త్​కి మంచివి కావు అనుకుంటారు. అయితే కొన్ని టీలు మీ శరీరం నుంచి టాక్సిన్స్​ను తొలగించి.. బరువు తగ్గడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యానికి.. అదిరే టీలు
ఆరోగ్యానికి.. అదిరే టీలు

Body Detoxing Tea : శరీరంలో కొన్ని ఆహారాలు మిగిలిపోతాయి. పర్యావరణం, జీవనశైలి కారణంగా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్‌లను నిర్విషీకరణ చేయడం చాలా ముఖ్యం. లేదంటే అవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే సరైన సమయంలో శరీరాన్ని డిటాక్సిఫై చేయడం ద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు. దీనితో పాటు ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

పండ్లు, కూరగాయలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటితో తయారు చేసిన టీలు.. మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపి.. బరువును అదుపులో ఉంచుతాయి. ఇంతకీ మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడే టీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది గుండె జబ్బులను తగ్గిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రణలో ఉంచుతుంది. రక్తపోటును సాధారణంగా ఉంచడంలో, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ గుణాలు శరీరాన్ని నిర్విషీకరణ చేసి.. అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

తయారీ విధానం

మీరు ఒక కప్పు నీటిలో 3 నుంచి 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలను వేసి.. 7 నుంచి 8 నిమిషాలు మరిగించండి. తర్వాత వడకట్టి నిమ్మరసం కలిపి తాగాలి.

పసుపు, అల్లం టీ

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ టీలో పుష్కలంగా ఉన్నాయి. పసుపు, అల్లం టీ మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో, జీర్ణవ్యవస్థను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ఏదైనా నొప్పితో బాధపడుతుంటే.. నొప్పి, వాపును తగ్గించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

తయారీ విధానం

ఒక కప్పు నీటిలో కొన్ని తురిమిన అల్లం, నాలుగు చిటికెడు పసుపు వేసి.. 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు దీన్ని వడకట్టి నిమ్మరసం పిండుకుని తాగాలి.

కొత్తిమీర టీ

కొత్తిమీర ఆకుల్లో తగినంత నీరు ఉంటుంది. ఇది మీ శరీరాన్ని చాలా కాలం పాటు హైడ్రేట్​గా ఉంచుతుంది. శరీరం హైడ్రేట్​గా ఉంటే.. డిటాక్స్ చేయడం సులభం అవుతుంది. ఇది మూత్రపిండాల నుంచి హానికరమైన పదార్ధాలను తొలగించడంలో.. ఆరోగ్యంగా ఉండడంలో సహాయం చేస్తుంది.

తయారీ విధానం

ఒక కప్పు నీటిలో తాజా కొత్తిమీర వేసి.. నీటిని 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు పై నుంచి నిమ్మరసం పిండుకుని అందులో అర చెంచా తేనె కలిపి తాగాలి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అదే సమయంలో యాంటీఆక్సిడెంట్లు కణాల నష్టాన్ని నిరోధిస్తాయి. రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను కూడా తగ్గిస్తాయి. అటువంటి పరిస్థితిలో.. క్యాన్సర్ వంటి ప్రధాన వ్యాధులు, కాలేయ సమస్యలతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి.

తయారీ విధానం

మార్కెట్‌లో అనేక రకాల గ్రీన్ టీలు అందుబాటులో ఉంటాయి. మీరు దానిని నీటిలో వేసి మరిగించి క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.

ఫెన్నెల్ టీ

శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ఫెన్నెల్ టీ ఒక గొప్ప ఎంపిక. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మూత్రవిసర్జన లక్షణాలు అదనపు ద్రవంతో పాటు శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. మూత్ర నాళానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

తయారీ విధానం

ముందుగా ఒక కప్పు నీటిని స్టవ్ మీద మరిగించాలి. ఇప్పుడు 2 చిన్న అల్లం ముక్కలతో పాటు 1 టీస్పూన్‌లో చూర్ణం చేసిన సోపు గింజలను వేసి.. 10 నిమిషాలు మరగనివ్వండి. దానిని వడకట్టి అర చెంచా తేనె కలుపుకుని తాగవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్