(1 / 6)
క్రమం తప్పకుండా సోంపు, తేనె తీసుకుంటే.. మీరు బరువు తగ్గుతారు. రాత్రిపూట గ్లాసు నీటిలో సోంపును నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిలో తేనె కలుపుకుని తాగాలి. ఇలా రెగ్యూలర్గా చేస్తే బరువు తగ్గుతారు.
(2 / 6)
ఒక టీస్పూన్ తేనెను వేడి చేసి అందులో సోంపు పొడి వేయాలి. జలుబుతో ఉన్నప్పుడు దీనిని తీసుకుంటే సమస్య తగ్గుతుంది. మీ ఇంట్లో సోంపు పొడి ఉంటే దానిని తేనెతో కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి.
(Pexels)(3 / 6)
కడుపులో గ్యాస్ సమస్యను తగ్గించడానికి లేదా ఆకలిని పెంచడానికి సోంపు గొప్పగా పనిచేస్తుంది. అందులో తేనె కలిపినా ఆకలి పెరుగుతుంది.
(4 / 6)
కొద్దిగా సోంపు పొడిని సాయంకాలం టీతో పాటు తీసుకోండి. దానిలో కొద్దిగా తేనే కలపి తాగండి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
(5 / 6)
చర్మాన్ని చక్కగా ఉంచుకోవడానికి సోంపు ఎంతగానో ఉపయోగపడుతుంది. సోంపు పొడిలో, తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మెరిసిపోతుంది.
(6 / 6)
కళ్లలో చికాకు లేదా దురద ఉంటే.. సోంపు చాలా ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తుంది. తేనె, సోంపు కలిపి తింటే కళ్లకు చాలా మంచిది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇతర గ్యాలరీలు