Asthma in Kids: మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, ఇవి ఆస్తమా ప్రారంభ సంకేతాలు
Asthma in Kids: ఆస్తమా ఎప్పుడైనా మొదలవ్వచ్చు, బాల్యంలో కూడా ఎంతోమంది ఆస్తమా బారిన పడుతూ ఉంటారు. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మీ పిల్లలకు ఉబ్బసం ఉన్నట్టు లెక్క.
Asthma in Kids: ఉబ్బసం లేదా ఆస్తమా... ఏ వయసులోనైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది బాల్యంలోనే ఎక్కువగా ప్రారంభమవుతుంది. బిడ్డకు ఆ ఉబ్బసం ఉందో లేదో తెలుసుకునేందుకు కొన్ని ప్రారంభ లక్షణాల గురించి తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. ఆస్తమా ఉన్న పిల్లల్లో కొన్ని రకాల ప్రారంభ సంకేతాలు కనబడతాయి. అలా కనిపిస్తే వారికి ఆస్తమా ఉందని అర్థం చేసుకోవాలి. లేదా అతి త్వరలో వారికి ఆస్తమా వచ్చే అవకాశం ఉందని అర్థం.
అలెర్జీలు వస్తున్నప్పుడు కొంతమంది పిల్లల్లో జీర్ణాశయంతర సమస్యలు వస్తాయి. అంటే పొట్టనొప్పి రావడం, అతిసారం, శ్వాసకోశ సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. ఇవి కూడా ఆస్తమా రావడానికి ముందు ప్రారంభ సంకేతాలు.
అలెర్జిక్ రెనిటిస్ అనే సమస్య కూడా పిల్లల్లో తరచూ వస్తూ ఉంటుంది. దీన్ని గవత జ్వరం అంటారు. ముక్కు లోపల పాలిప్స్ పెరగడం, ముక్కులో దురద ఎక్కువగా వేయడం, గొంతులో దురద వేయడం వంటివి జరుగుతాయి. శ్వాసకోశ అలెర్జీ వస్తే ఊపిరి పీల్చుకునేటప్పుడు వదిలినప్పుడు విజిల్ శబ్దం వస్తూ ఉంటుంది. ఇది కూడా ఆస్తమాకు ప్రారంభ లక్షణంగానే చెప్పుకోవాలి.
పిల్లల్లో ఆస్తమా లక్షణాలు కనిపించేటప్పుడు వారిని వెంటనే వైద్యులకు చూపించడం మంచిది. ఛాతీ బిగుతుగా అనిపించడం, శ్వాస ఆడక పోవడం, దగ్గు ఎక్కువగా రావడం, కఫం పట్టడం, వాంతులు రావడం ఇవన్నీ కూడా ఆస్తమా సంకేతాలే. అయితే అన్ని అలర్జీలు ఆస్తమాను అభివృద్ధి చేయాలని లేదు. కానీ కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆస్తమా వస్తుందని అర్థం చేసుకోవాలి.
పిల్లలకు వచ్చే అలెర్జీలను తేలికగా తీసుకోవద్దు. ఎర్ర దద్దుర్లు వచ్చినా కూడా అవి ఆస్తమా వల్ల కలగవచ్చు. కాబట్టి వైద్యులను సంప్రదించడం అన్న విధాలా ఉత్తమం.
టాపిక్