World Asthma Day: ఆస్తమా ఉందా? ముందే జాగ్రత్త పడండి, ఆస్తమాతో పాటూ వచ్చే వ్యాధులు ఇవే-have asthma beware these are the diseases that accompany asthma ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Asthma Day: ఆస్తమా ఉందా? ముందే జాగ్రత్త పడండి, ఆస్తమాతో పాటూ వచ్చే వ్యాధులు ఇవే

World Asthma Day: ఆస్తమా ఉందా? ముందే జాగ్రత్త పడండి, ఆస్తమాతో పాటూ వచ్చే వ్యాధులు ఇవే

Haritha Chappa HT Telugu
May 07, 2024 10:05 AM IST

World Asthma Day: ప్రపంచ ఆస్తమా దినోత్సవం వచ్చేసింది. ఆస్తమా చెప్పుకునేందుకు చిన్న సమస్య అయినా, దానితో పడే బాధ ఎక్కువ. ఆస్తమాతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి.

ప్రపంచ ఆస్తమా దినోత్సవం
ప్రపంచ ఆస్తమా దినోత్సవం (Pixabay)

World Asthma Day: ప్రపంచ ఆస్తమా దినోత్సవం రోజు ఆ వ్యాధి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారికి కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉబ్బసం అనేది వాయు మార్గాలు వాచిపోవడం లేదా సంకోచించడం వల్ల వచ్చే శ్వాసకోశ పరిస్థితి ఇది. ఇతర వ్యాధులతో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తమాతో పాటు వచ్చే అవకాశం ఉన్న వ్యాధులు ఎన్నో ఉన్నాయి.

yearly horoscope entry point

అలెర్జీ రినిటీస్

అలెర్జీ రెనిటీస్ అనేది ఉబ్బసంలో కనిపించే సాధారణ లక్షణం. ఆస్తమా ఉన్నవారికి ఈ అలెర్జీ రెనిటిస్ తరచూ వస్తూ ఉంటుంది. దుమ్మూ, ధూళి, పెంపుడు జంతువుల వెంట్రుకలు వంటివి ట్రిగ్గర్లుగా పనిచేస్తాయి. వీటి వల్ల అలెర్జీ రెనిటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్

దీన్ని COPD అని కూడా పిలుస్తారు. ఉబ్బసం ఉన్న వారిలో ఈ సీఓపిడి వచ్చే అవకాశం ఎక్కువ. దీర్ఘకాలంగా ఆస్తమాతో బాధపడుతున్న వారిలో ఈ సీఓపిడి కనిపిస్తూ ఉంటుంది. ధూమపానం వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది.

గ్యాస్ట్రో ఎసోఫోర్గియల్ రిఫ్లెక్స్ డిసీజ్

ఆస్తమాతో పాటు ఈ డిసీజ్ కూడా తరచూ వస్తూ ఉంటుంది. ఈ రిఫ్లెక్స్ ఆస్తమా లక్షణాలను ఎక్కువ చేస్తుంది. పొట్ట నుండి యాసిడ్ రిఫ్లెక్స్ శ్వాస నాళాల వరకు చేరి చికాకు పడుతుంది. దీనివల్ల దగ్గు అధికంగా వస్తుంది.

ఊబకాయం

ఊబకాయం అనేది ఉబ్బసానికి ప్రమాదకరమైనది. అధిక శరీర బరువు వల్ల వాయు మార్గాల్లో ఇన్ఫ్లమేషన్ అధికమవుతుంది. అవి సన్నగా మారేలా చేస్తుంది. ఊబకాయం ఉన్న వారిలో ఆస్తమా తీవ్రంగా మారిపోతుంది. దీని నియంత్రించడం కష్టంగా మారుతుంది.

సైనసైటిస్

దీర్ఘకాలికంగా సైనసైటిస్ తో బాధపడుతున్న వారు ఆస్తమా బారిన పడే అవకాశం ఉంది. సైనసైటిస్ ఆస్తమాతో సమానమైన ఇన్ఫ్ల మేటరీ ప్రక్రియను పంచుకుంటుంది. సైనస్ ఇన్ఫెక్షన్లు ఆస్తమా లక్షణాలను మరింతగా తీవ్రం చేస్తాయిజ. ఇలాంటి సమయంలో ఆస్తమాను నియంత్రించాలంటే సైనసైటిస్ ను ముందుగా చికిత్స చేయాలి.

స్లీప్ ఆప్నియా

ఆస్తమా... స్లీప్ ఆప్నియా రెండు దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. నిద్రలో శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలిగించే ఒక వ్యాధి ఆస్తమా. ఇది నిద్రా నాణ్యతను తగ్గించేస్తుంది.ఇది ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. స్లీప్ ఆప్నియా రాత్రిపూట ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. కాబట్టి ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆస్తమాను నియంత్రణలో ఉంచుకుంటే స్లీప్ ఆప్నియా నియంత్రణలో ఉంటుంది.

మానసిక ఆందోళన

ఆస్తమా అనేది మానసిక ఆందోళనతో ముడిపడి ఉంటుంది. మానసిక ఒత్తిడి కారణంగా ఆస్తమా లక్షణాలు పెరిగిపోతాయి. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఆస్తమాను తగ్గించుకోవచ్చు.

Whats_app_banner