Whooping cough: పిల్లల్లో పెరిగిపోతున్న హూపింగ్ దగ్గు కేసులు, ఈ బ్యాక్టిరియా సోకకుండా జాగ్రత్త పడండి-whooping cough in children be careful not to get infected with this bacteria ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Whooping Cough: పిల్లల్లో పెరిగిపోతున్న హూపింగ్ దగ్గు కేసులు, ఈ బ్యాక్టిరియా సోకకుండా జాగ్రత్త పడండి

Whooping cough: పిల్లల్లో పెరిగిపోతున్న హూపింగ్ దగ్గు కేసులు, ఈ బ్యాక్టిరియా సోకకుండా జాగ్రత్త పడండి

Haritha Chappa HT Telugu
Apr 17, 2024 08:10 AM IST

Whooping cough: చైనా, అమెరికా, యూకే తదితర దేశాల్లో హూపింగ్ దగ్గు విజృంభిస్తోంది. ఈ హూపింగ్ దగ్గు అనేక దేశాలకు సోకుతోంది. మన దేశంలో కూడా కొంతమంది ఈ దగ్గుతో ఇబ్బంది పడతారు.

హూపింగ్ దగ్గు
హూపింగ్ దగ్గు (Shutterstock)

హూపింగ్ దగ్గు వివిధ దేశాల్లోని పిల్లలకు సోకుతోంది. ఇది ఆందోళనకరంగా మారుతోంది. చైనాలో ఈ దగ్గు కారణంగా కొన్ని మరణాలు సంభవించాయి. యుఎస్, యుకె, ఫిలిప్పీన్స్, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్లో లో కూడా హూపింగ్ దగ్గు కేసులు నమోదయ్యాయి. పిల్లలు, శిశువులలో ఈ దగ్గు అధికంగా కనిపిస్తోంది. నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, రెండు నెలల్లో చైనాలో 32,380 హూపింగ్ దగ్గు కేసులు నమోదయ్యాయి

హూపింగ్ దగ్గు అంటే ఏమిటి?

హూపింగ్ దగ్గు అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల సోకుతుంది. ఇదొక అంటు వ్యాధి. ఇది బోర్డెటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. శిశువులు, చిన్న పిల్లల్లో ఇది వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు శ్వాసకోశ బిందువుల ద్వారా ఈ బ్యాక్టిరియా ఎదుటి వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది.

ఇది ప్రధానంగా శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ముక్కు కారటం, పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, తుమ్ములు, కళ్ల నుంచి నీరు కారడం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనికి వ్యాక్సిన్ ఉంది. మూడుసార్లు ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిది ఆరు వారాలకు, రెండోది పది వారాలకు, మూడోది 14 వారాలకు ఇస్తారు. తరువాత బూస్టర్ డోస్ కూడా ఇస్తారు. హూపింగ్ దగ్గును 100 రోజుల దగ్గు వ్యాధి అని కూడా అంటారు. ఇందులో దగ్గి దగ్గి వాంతులు కూడా అవుతాయి.

హూపింగ్ దగ్గు లక్షణాలు

హూపింగ్ దగ్గుకు కారణమైన బాక్టీరియా శ్వాసనాళ వాపుకు, అధిక శ్లేష్మం ఉత్పత్తికి కారణమవుతుంది. న్యుమోనియా, మూర్ఛ, మెదడు దెబ్బతినడం వంటి కొన్ని తీవ్రమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి ముక్కు కారటం, తుమ్ములు, తేలికపాటి పొడి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స చేయకపోతే, హూపింగ్ దగ్గు దీర్ఘకాలికంగా వేధిస్తుంది. లేదా మరణానికి దారితీస్తుంది. అనేక రకాల పరీక్షల ద్వారా హూపింగ్ దగ్గు వచ్చిందో లేదో నిర్ధారిస్తారు.

చికిత్స ఎలా

డిటిఎపి వ్యాక్సిన్ పిల్లలకు ఇవ్వాలి. అలాగే టిడిఎపి వ్యాక్సిన్లను పెద్దలకు ఇవ్వవచ్చు. పిల్లలకు డిటిఎపి వ్యాక్సిన్ ఉపయోగించి హూపింగ్ దగ్గును రాకుండా అడ్డుకోవచ్చు. పెద్దలు, గర్భిణీ స్త్రీలు టిడిఎపి వ్యాక్సిన్ పొందవచ్చు. చేతుల పరిశుభ్రత, దగ్గు / తుమ్మినప్పుడు ముఖాన్ని కప్పుకోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం వంటివి చేయాలి.

పిల్లలకు డిటిఎపి వ్యాక్సిన్ 2 నెలల వయస్సు నుండే ప్రారంభమవుతుంది. ఈ వ్యాక్సిన్ డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వంటి రోగాల నుంచి రక్షిస్తుంది. పెర్టుసిస్ కలిగిన టీకాలు కాబోయే తల్లులకు కూడా సురక్షితం. గర్భిణీ స్త్రీలు హూపింగ్ దగ్గు నుండి రక్షణ పొందడానికి 20 మరియు 32 వారాల మధ్య హూపింగ్ దగ్గు టీకా పొందాలి. గర్భంతో ఉన్నప్పుడు ఈ టీకాలు తీసుకుంటే పిండానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

టాపిక్