One Spoon Honey: రోజుకో స్పూను తేనె తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి అలర్జీలు రాకుండా అడ్డుకోవచ్చా?
One Spoon Honey: రోజుకో స్పూను తేనె తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలానుగుణంగా వచ్చే అలెర్జీల నుండి బయటపడవచ్చు. దగ్గు, జలుబు త్వరగా రాకుండా అడ్డుకోవచ్చు.
One Spoon Honey: తేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దాన్ని ప్రతిరోజూ తినే వారి సంఖ్య తక్కువే. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక స్పూన్ తేనె తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అలాగే యాంటీ హిస్టామిన్ లక్షణాలు కూడా ఎక్కువ. ఇవన్నీ కలిసి మనలో అలెర్జీ లక్షణాలు రాకుండా అడ్డుకుంటాయి. తరుచూ జలుబు, దగ్గు బారిన పడేవారు ప్రతి రోజు స్పూన్ తేనె తాగడం అలవాటు చేసుకుంటే అది సహజమైన రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి అన్ని రకాల అలెర్జీల నుంచి రక్షణ లభిస్తుంది.
అలెర్జీల లక్షణాలను తగ్గించే సామర్థ్యం తేనెతో సహజంగానే ఉంటుంది. కొన్ని అధ్యయనాలు చెప్పిన ప్రకారం దీనిలో ఉండే హిస్టామిన్ లక్షణాలు శరీరంలో డిసెన్సిటైజ్ చేయడానికి సహాయపడతాయని, దీనివల్ల కాలక్రమేణా అలెర్జీ కారకాలు బలహీన పడేలా చేస్తాయని తెలుస్తోంది.
తేనె రోజూ తింటే
యాంటీ హిస్టామైన్ లక్షణాలు గల తేనెను ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకోమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తేనే శరీరంలో హిస్టామిన్ స్థాయిలను తగ్గించడం ద్వారా అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే హెర్బల్ టీలలో కూడా దీన్ని భాగం చేసుకోవచ్చు. పెరుగులో కాస్త తేనె వేసి తినవచ్చు.
స్వచ్ఛమైన తేనెను తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. కృత్రిమ మందులు కలిపిన తేనెను తాగకూడదు. సహజంగా తీసిన తేనెను తాగడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. కల్తీ లేని తేనెను తాగేందుకు ప్రయత్నించాలి. విశ్వసనీయమైన సంస్థలకు చెందిన తేనెను వాడడం మంచిది.
తేనె కల్తీని ఎలా కనిపెట్టాలి?
తేనెలో మొలాసిస్ వంటి కల్తీ పదార్థాలు కలిపి దాన్ని కల్తీ చేస్తారు.దీని స్వచ్ఛతను పరీక్షించేందుకు ఒక బొట్టు తేనెను నీటిలో వేయాలి. నీటిలో తేనె సులభంగా కరిగిపోతే అది స్వచ్ఛమైన తేనె అని అర్థం. కరగకుండా ఎక్కువసేపు అలానే ఉంటే అది కల్తీ చేసినదని అర్థం చేసుకోవాలి.
ప్రతిరోజూ తేనె తాగడం వల్ల రక్తానికి ఎంతో మంచిది. రక్తం శుద్ధి అవుతుంది. చక్కెరతో పోలిస్తే తేనె ఎంతో సురక్షితమైనది. చక్కెరను పూర్తిగా మానేసి తేనెను అలవాటు చేసుకుంటే మంచిది. ఇది యాంటీసెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి గాయాలను త్వరగా తగ్గిస్తుంది. కాలిన గాయాలుకు తేనెను అప్లై చేయడం ద్వారా దాని త్వరగా తగ్గేలా చేసుకోవచ్చు. జీర్ణ ప్రక్రియకు తేనె ఎంతో సహాయపడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసేందుకు తన వంతు సాయాన్ని చేస్తుంది. చర్మానికి తరచూ తేనెను రాయడం వల్ల మచ్చలు, మొటిమలు, చర్మంపై ముడతలు వంటివి తగ్గుతాయి. పిల్లలకు ప్రతిరోజూ ఒక స్పూన్ తేనె తాగించడం అలవాటు చేయండి. లేదా పాలల్లో తేనె వేసి ఇవ్వండి. పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె వేసి తాగడం అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరం.
అతిసారం వంటి జీర్ణవ్యాధుల నుండి ఇది తేలికగా బయటపడేస్తుంది. నరాల వ్యాధులకు ఎంతో ఉపయోగపడుతుంది. యాంగ్జయిటీ, మానసిక ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజూ ఒక స్పూను తాగడం అలవాటు చేసుకోవాలి. గొంతు నొప్పి, దగ్గు తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కడుపునొప్పిని రాకుండా అడ్డుకోవడంలో ఇది సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక స్పూన్ నుండి రెండు స్పూన్లు తేనె తాగడం అలవాటు చేసుకోవాలి. అంతకుమించి తాగక పోవడమే మంచిది. వారానికి ఒకసారి మాత్రమే తీసుకునేవారు మూడు, నాలుగు స్పూన్లు ఒకేసారి తీసుకోవచ్చు. ప్రతిరోజూ తీసుకునేవారు రోజుకు ఒక స్పూను లేదా రెండు స్పూన్లతో ఆపేస్తే ఉత్తమం.
టాపిక్