తెలుగు న్యూస్ / ఫోటో /
Sneezing: తుమ్మేటప్పుడు నోరు, ముక్కు గట్టిగా మూసుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?
- Health Tips: మీరు తుమ్మినప్పుడు నోరు లేదా ముక్కును పట్టుకుంటున్నారా? అది చాలా ప్రమాదమని చెబుతున్నారు వైద్యులు.
- Health Tips: మీరు తుమ్మినప్పుడు నోరు లేదా ముక్కును పట్టుకుంటున్నారా? అది చాలా ప్రమాదమని చెబుతున్నారు వైద్యులు.
(1 / 5)
చాలా మంది తుమ్మినప్పుడు ముక్కు, నోటిని గట్టిగా మూసుకుంటారు. తమ్మేటప్పుడు ఆ తుంపరలు ఎదుటివారిపై పడకుండా రుమాలును అడ్డుపెట్టుకోవడం మంచిది, కానీ ముక్కు నోటిని గట్టిగా మూయడం మాత్రం ప్రాణాంతకం కావచ్చు.
(2 / 5)
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు, నోటిని తేలికగా కప్పుకోవాలని వైద్యులు చెబుతారు కానీ, గట్టిగా అదమాలని చెప్పరు. ఇలా చేయడం వల్ల రిస్క్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
(3 / 5)
తుమ్మిన సమయంలో నోటిలోని గాలి గంటకు 160 కి.మీ వేగంతో బయటకు వస్తుంది. ఈ సమయంలో ముక్కు, నోటిని గట్టిగా మాయడం వల్ల వల్ల చెవి దెబ్బతింటుంది. దీంతో వెంటనే కర్ణభేరి పగిలిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా చాలామందికి అన్నవాహిక, ఊపిరితిత్తులు కూడా ప్రభావితమవుతాయి.
(4 / 5)
తుమ్ముల నుండి వచ్చే ఒత్తిడి మెదడు నరాలను చీల్చుతుందని అధ్యయనం చెబుతోంది. తుమ్మును బలవంతంగా బయటికి రాకుండా ఆపడంవ వల్ల మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు