కఫం చేరి ఇబ్బంది పడుతున్నారా? రోజూ వీటిని తినండి-troubled by phlegm eat these daily ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కఫం చేరి ఇబ్బంది పడుతున్నారా? రోజూ వీటిని తినండి

కఫం చేరి ఇబ్బంది పడుతున్నారా? రోజూ వీటిని తినండి

Published Feb 09, 2024 02:08 PM IST Haritha Chappa
Published Feb 09, 2024 02:08 PM IST

  • శ్లేష్మం లేదా కఫం... ఇది చాలా చికాకు కలిగిస్తుంది. కఫం పట్టకుండా ఉండేందుకు, ఒకవేళ పట్టినా త్వరగా తొలిగేందుకు కొన్ని రకాల ఆహారాలను మెనూలో చేర్చుకోవాలి.

కఫం తగ్గితేనే శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  కొన్నిసార్లు శరీరంలో చేరిన అదనపు శ్లేష్మాన్ని బయటకు పంపడానికి మన శరీరానికి కొద్దిగా శక్తి అవసరం. ఆ శక్తిని ఇవ్వాలంటే కొన్ని రకాల ఆహారాలను రోజూ తినాలి. 

(1 / 9)

(Freepik)

నిమ్మకాయలు: విటమిన్ సితో నిండి ఉంటాయివి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కఫాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. నిమ్మ వంటి సిట్రస్ పండ్లు శ్వాసకోశాల్లోని  శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడతాయి.

(2 / 9)

యాపిల్స్: ఈ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. యాపిల్స్ శుభ్రమైన శ్వాసకోశ వ్యవస్థకు మద్దతునిస్తాయి. 

(3 / 9)

అల్లం: తరుచూ దగ్గు,  జలుబు సమస్యల బారిన పడుతూ ఉంటే మీ రోజు వారీ ఆహారంలో అల్లం ఉండేలా చూసుకోండి. ఈ స్పైసి రూట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. కఫాన్ని తొలగిస్తుంది. 

(4 / 9)

దోసకాయ: శరీరం నుండి అదనపు కఫాన్ని తొలగించాలంటే తేమ అవసరం. శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే కఫాన్ని వదిలించడం కష్టం. కాబట్టి దోసకాయను రోజూ తింటూ ఉంటే త్వరగా కఫం పోతుంది.నీటిని కూడా అధికంగా తాగుతూ ఉండాలి. 

(5 / 9)

బ్రోకలీ: పోషకాల పవర్‌హౌస్ ఇది. బ్రోకలీ బలమైన రోగనిరోధక వ్యవస్థను అందిస్తుంది. 

(6 / 9)

(Shutterstock)

పైనాపిల్: జ్యుసీగా ఉండే ఈ పండ్లలో శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి ఉంటుంది. దీనిలో  బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.

(7 / 9)

(Unsplash)

గుమ్మడికాయ: దీనిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, గుమ్మడికాయ శ్లేష్మ పొర ఆరోగ్యానికి తోడ్పడుతుంది.  (Getty Images/iStockphoto (PIC FOR REPRESENTATION))

(8 / 9)

బెర్రీలు: యాంటీఆక్సిడెంట్లతో నిండిన బెర్రీలు మొత్తం శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

(9 / 9)

(Pexels)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు