Bamboo plant: లక్కీ వెదురు మొక్క మీ ఇంట్లో ఉందా? అది ఇలా ఉంటే మాత్రం దురదృష్టం కలిగిస్తుంది-follow these vastu tips for bamboo plant otherwise you will face difficulties ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Follow These Vastu Tips For Bamboo Plant Otherwise You Will Face Difficulties

Bamboo plant: లక్కీ వెదురు మొక్క మీ ఇంట్లో ఉందా? అది ఇలా ఉంటే మాత్రం దురదృష్టం కలిగిస్తుంది

Gunti Soundarya HT Telugu
Feb 29, 2024 01:27 PM IST

Bamboo plant: లక్కీ వెదురు మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే లక్కీ వెదురు సంరక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదురవుతాయి.

వాస్తు ప్రకారం వెదురు మొక్క ఎలా ఉండాలి?
వాస్తు ప్రకారం వెదురు మొక్క ఎలా ఉండాలి? (pexels)

Bamboo plant: కొన్ని మొక్కలు మీ ఇంటికి అందాన్ని మాత్రమే కాదు, ఆనందాన్ని కూడా ఇస్తాయి. అటువంటి జాబితాలో ఉన్నటువంటి మొక్క వెదురు మొక్క. దీన్నే లక్కీ బాంబూ అని కూడా అంటారు, వాస్తు శాస్త్రం, ఫెంగ్ షూయి ప్రకారం కూడా వెదురు మొక్క చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇంట్లో వెదురు మొక్కలు నాటడం వల్ల ఆ వ్యక్తి అదృష్టవంతుడు అవుతాడని రెండు శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వెదురు మొక్క సంరక్షణ కూడా చాలా ముఖ్యమైన విషయం. వెదురు మొక్కని సరిగా సంరక్షించుకోకపోతే అది మీకు దురదృష్టంగా మారే అవకాశం ఉంది. మీ ఇంట్లో కనుక ఈ మొక్క ఉంటే దానికి సంబంధించి ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా పాటించాలి. అలా చేయడంలో విఫలమైతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వెదురు మొక్క సంరక్షణ చిట్కాలు

వెదురు మొక్కలు కుండీలో మాత్రమే నాటాలి. దీన్ని భూమిలో నాటితే చాలా పెద్దదిగా పెరుగుతుంది. అది శుభానికి బదులు అశుభ ప్రభావాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది.

ఇంట్లో వెదురు మొక్క గరిష్టంగా రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు ఉండాలి. ఎందుకంటే ఎక్కువ పెరిగితే అది ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. అలాగే ఈ లక్కీ బాంబూ ఇంటి నైరుతి దిశలో ఎప్పుడూ నాటకూడదు. ఈ దిశలో తులసి, అరటి, లక్కీ బాంబు వంటి పవిత్రమైన చెట్లు నాటితే అశుభ ప్రభావాలు కలిగిస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను ఉత్తర, తూర్పు దిశల్లో నాటడం వల్ల ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. అది మాత్రమే కాకుండా ఈ మొక్కని వాయువ్య దిశలో కూడా నాటుకోవచ్చు. మత శ్వాసాల ప్రకారం ఇంట్లో ఉండే వెదురు మొక్క ఎప్పుడు ఎండిపోకూడదు. అది ఇంట్లో ఉన్న వారికి ఆశుభ ఫలితాలు కలిగిస్తుంది.

ఎండిపోయిన వెదురు మొక్కని వెంటనే తొలగించి దాని స్థానంలో పచ్చగా ఉండే మొక్కని భర్తీ చేయాలి. మురికి ప్రదేశంలో ఎప్పుడూ నాటకూడదు. తులసి, అరటి చెట్ల దగ్గర ఉంచుకోవచ్చు.

డ్రాయింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో కూడా ఈ మొక్కను పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి కుటుంబ సంబంధాలు మధురంగా మారుతాయి.

చిన్నగా కనిపించే లక్కీ బాంబూ ఇంట్లో లేదా ఆఫీసులో ఉండటం వల్ల మీ పరిసర ప్రాంతాలు కూడా అందంగా కనిపిస్తాయి. వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కువగా నీరు పోసే అవసరం ఉండదు. మామూలు మొక్కల్లాగా వెదురు మొక్కకి ఎక్కువగా నీళ్ళు పోస్తే అది కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.

వెదురు మొక్క ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు తొలగించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఎలాంటి వెదురు మొక్క పెట్టుకోవచ్చు

అదృష్టం సంపద కావాలని కోరుకుంటున్నట్లయితే మీరు ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర మొక్కలు పెట్టుకోవచ్చు. వెదురు అనేది గాలిని శుద్ధి చేసే గుణాలు కలిగి ఉంటుంది. కార్బన్ డైయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. అందువల్లే ఈ మొక్క మీ ఇంట్లో ఉండటం వల్ల స్వచ్ఛమైన గాలి మీకు అందుతుంది.

ఈ మొక్క ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ ఎత్తు లేకుండా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నీటిలో మీరు వెదురు మొక్కని పెంచుతున్నట్టయితే డానికి ఎరుపు రంగు రిబ్బన్ కట్టి నీటిలో కొన్ని నాణాలు గులకరాళ్లు వేస్తే ఇంట్లో ఉన్న పంచభూతాలను సమతుల్యం చేసి సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తుంది.

అదృష్టాన్ని ఇచ్చే మొక్కలలో వెదురు ఒకటని వాస్తు ప్రకారం చెబుతోంది. ఇది డబ్బుని, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీరు పెంచుకునే వెదురు మొక్కల కాండాల సమూహం సరిగా ఉండేలా చూసుకోవాలి. అదృష్టం కోసం ఎదురు 8 లేదా తొమ్మిది కాండాలు ఉండే మొక్క తెచ్చుకోవాలి. వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు 5 కాండాలు, ఆరోగ్యం కోసం ఏడు కాండయాలు ఉన్న మొక్క పెంచుకోవచ్చు.

WhatsApp channel

టాపిక్