Milk Recipes । పాలతో చేసే పనీర్ పాయసం.. దీని రుచి అమృతం!
Healthy Milk Recipes: సాయంత్రాన మీ నోటిని తీపి చేసుకోవడానికి, మీ కడుపును నింపడానికి పాలతో తయారు చేసే అద్భుతమైన రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాం.
Healthy Milk Recipes: పాలు ఒక ఆహార పదార్థం అయితే, పాలతో కూడా అనేక ఆహార పదార్థాలను సృష్టించవచ్చు. ఉదాహారణకు పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను మొదలైనవి. ఇవి కాకుండా పాలతో అనేక రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు, పాయసం నుంచి డెజర్ట్‌ల వరకు అనేక రెసిపీలు ఉన్నాయి. జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం (World Milk Day) గా పాటిస్తారు. పాలు తాగిగే కలిగే ప్రయోజనాలను ఎత్తిచూపడం, పాడి పరిశ్రమను మరింత వృద్ధికి పాటుపడటం కోసం ఈరోజు ప్రాముఖ్యతను కలిగి ఉంది.
ఈ ప్రత్యేకమైన రోజున మీరు పాలతో తయారు చేసే అద్భుతమైన రెసిపీలను ఇక్కడ అందిస్తున్నాం. ఈ సాయంత్రాన మీ నోటిని తీపి చేసుకోవడానికి, మీ కడుపును నింపడానికి ఇవి ఉపయోగపడతాయి.
Almond Milk Recipe కోసం కావలసినవి
- పాలు - 500 మిల్లీలీటర్లు
- బాదంపప్పు - 50 గ్రాములు
- ముడి చక్కెర - 40 గ్రాములు
- కుంకుమపువ్వు - చిటికెడు
బాదం మిల్క్ రెసిపీ- తయారీ విధానం
- ముందుగా పాలను చిన్నమంట మీద ఒక అరగంట పాటు లేదా చిక్కగా మారే వరకు మరగబెట్టండి.
- అనంతరం చల్లబరిచి, పాలలో సగం బాదంపప్పులను వేసి బ్లెండ్ చేయండి.
- ఆపైన కుంకుమపువ్వు, చక్కెరను వేసి బాగా కలపండి.
- చివరగా మరికొన్ని బాదాంలను చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి పాలలో కలిపేయండి.
అంతే, బాదం మిల్క్ రెడీ.
Paneer Payasam Recipe కోసం కావలసినవి
- 1 లీటర్ పాలు
- 150 గ్రాముల కాటేజ్ చీజ్
- 1 స్పూన్ రవ్వ
- 4 పచ్చి ఏలకుల చూర్ణం
- 6-7 తంతువుల కుంకుమపువ్వు
- 1/2 కప్పు చక్కెర
- 6-7 బాదంపప్పులు, సన్నగా తరిగినవి
పనీర్ పాయసం రెసిపీ- తయారీ విధానం
- ఒక పెద్ద పాన్‌లో పాలను మరిగించి, సగానికి వరకు ఉడికించాలి.
2. ఇప్పుడు పనీర్, రవ్వని కలిపి మెత్తని పేస్ట్‌లా మాష్ చేయండి. ఆపైన చిన్న చిన్న బాల్స్ చేయండి.
3. పాలు చిక్కగా మరిగినపుడు, పంచదార, యాలకుల చూర్ణం, కుంకుమపువ్వు వేయండి.
4. ఇప్పుడు వేడిని మరింత పెంచి, పనీర్ బాల్స్ కలపండి. 10 నిమిషాలు ఉడికించాలి.
5. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లబరిచి ఫ్రిజ్‌లో ఉంచాలి.
6. చివరగా బయటకు తీసి బాదంపప్పు ముక్కలతో అలంకరించాలి.
అంతే, పనీర్ పాయసం రెడీ. ఈ పనీర్ పాయసంను ఎక్కువగా బెంగాలీలు చేసుకుంటారు.
సంబంధిత కథనం