Drink Milk Everyday | రోజూ ఒక గ్లాసు పాలు తాగండి, ఈ ప్రయోజనాలు ఉంటాయి!
World Milk Day 2023: పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మీకు సరైన మోతాదులో కాల్షియం అందుతుంది, పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చూడండి.
World Milk Day 2023: పాలు అనేక ముఖ్యమైన పోషకాలకు స్టోర్‌హౌస్. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మీకు సరైన మోతాదులో కాల్షియం అందుతుంది. అంతేకాకుండా, ప్రోటీన్, ఫాస్పరస్, పొటాషియం, అయోడిన్, రైబోఫ్లావిన్ , పాంటోథెనిక్ యాసిడ్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా శాఖాహారులకు విటమిన్ బి12 పోషకం రోజువారీ అవసరాన్ని పాలు తీరుస్తాయి. మెదడు అభివృద్ధికి, సాధారణ రక్తపోటును నిర్వహించడానికి, రోగనిరోధక శక్తికి, కండరాలు, ఎముకలు, దంతాలను బలంగా ఉంచడానికి పాలు తాగాలి.
ట్రెండింగ్ వార్తలు
పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుపుతూ ప్రతి సంవత్సరం జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవంగా పాటిస్తారు. జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు పాడి ప్రయోజనాలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ 2001 సంవత్సరంలో ఈ రోజును రూపొందించింది. పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చూడండి.
రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది
పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలు తాగడం ద్వారా శరీరానికి రోజువారీగా అవసరమయ్యే ప్రోటీన్, అమైనో ఆమ్లాలు లభిస్తాయి. అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
పాలలో ప్రోటీన్‌లు నిండుగా ఉంటాయి, ఒక గ్లాసు పాలు తాగటం వలన కడుపు నిండిన భావన కలుగుతుంది, ఆకలి బాధ తీరుతుంది. అదనంగా, పాలలోని కాల్షియం కంటెంట్ మెటబాలిజం బూస్టర్‌గా పనిచేస్తుంది, ఈ రకంగా పాలు బరువు తగ్గడంలో సహాయపపడగలవు.
ఎముకలు బలోపేతం
పాలలో మన ఎముకల పటిష్టతకు అవసరమైన కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి, ప్రోటీన్ వంటి పోషకాలు ఉన్నాయి. రోజూ పాలు తాగటం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఎముకల పగుళ్లు వచ్చే ప్రమాదం ఉండదు.
ఒత్తిడిని తగ్గిస్తుంది
రాత్రి గోరు వెచ్చని పాలు తాగడం వలన ఒత్తిడి తగ్గిండంలో సహాయపడుతుంది.పాలలో నిర్దిష్ట అమైనో ఆమ్లాల ఉనికి కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది, ఫలితంగా మీరు ఉదయం ఎలాంటి ఆందోళన లేకుండా మేల్కొంటారు.
మంచి నిద్ర
పాలలో ఉండే ట్రిప్టోఫాన్, మెలటోనిన్ అనే రెండు సమ్మేళనాలు మంచి నిద్రను కలిగిస్తాయి. ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, విశ్రాంతిని చేకూరుస్తుంది. అలాగే మెలటోనిన్ ను స్లీప్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది మీకు నిద్రను కలిగించే హార్మోన్. కాబట్టి పాలు తాగటం వలన హాయిగా నిద్రపడుతుంది.
సంబంధిత కథనం