Air Purifying Plants । స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే.. మీ ఇంట్లో ఇలాంటి మొక్కలను పెంచండి!-air purifying plants for indoors to breath fresh oxygen air and keep houses dust proof ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Air Purifying Plants । స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే.. మీ ఇంట్లో ఇలాంటి మొక్కలను పెంచండి!

Air Purifying Plants । స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే.. మీ ఇంట్లో ఇలాంటి మొక్కలను పెంచండి!

HT Telugu Desk HT Telugu
Mar 31, 2023 04:04 PM IST

Air Purifying Plants: స్వచ్ఛమైన గాలి పీల్చాలంటే ఎక్కడికో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే ఇలాంటి మొక్కలను పెంచుకోండి, అవి గాలిని శుభ్రపరుస్తాయి.

Air Purifying Plants
Air Purifying Plants (Unsplash)

Gardening Ideas: మొక్కలు ఉన్న ఇల్లు ప్రశాంతతకు నిలయం. మొక్కలు ఇంటికి అందాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని , శ్రేయస్సును పెంచుతాయి. ఇంటి వెలుపలే కాకుండా ఇంటిలోపల కూడా మీరు మొక్కలను (Indoor Plants) పెంచుకోవచ్చు. కొన్ని రకాల మొక్కలను ఇంటి లోపల పెంచుకోవడం చాలా ప్రయోజనం కూడా.

నేటి వేగవంతమైన ప్రపంచంలో పని ఎక్కువవుతోంది, ప్రశాంతత కరువవుతోంది, ఫలితంగా ఆరోగ్యం మననుంచి దూరం అవుతోంది. మరోవైపు కాలుష్యం, రసాయనాలు, దుమ్ము-ధూళి వంటివి పీల్చేగాలిని సైతం కలుషితం చేస్తున్నాయి. అయితే కొన్ని మొక్కలు ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా ఉన్నాయి. వాటిని ఇంట్లో పెంచుకోవడం ద్వారా అవి గాలి నుండి ధూళిని, అలర్జీ కారకాలను తొలగించి, మీరు పీల్చడానికి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ఇవి గాలిని శుభ్రపరచడమే కాకుండా వీటి పచ్చదనంతో మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. మీ మనసును తేలికపరిస్తాయి. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు.

Air Purifying Plants- గాలిని శుద్ధి చేసే మొక్కలు

గాలిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన మొక్కలేవో ఇక్కడ తెలుసుకోండి. వీటిని మీ ఇంట్లో పెంచుకొని ఇండోర్ గార్డెన్ (Indoor Garden) సృష్టించుకోండి.

Boston Fern- బోస్టన్ ఫెర్న్‌

బోస్టన్ ఫెర్న్‌లను నెఫ్రోలెపిస్ ఎక్సల్టాటా అని కూడా పిలుస్తారు, వీటికి ఉండే దట్టమైన ఆకుపచ్చని ఆకులు గాలిని సమర్థవంతంగా శుద్ధి చేస్తాయి. సాధారణంగా గృహాలను శుభ్రపరిచేందుకు ఉపయోగించే ఉత్పత్తులు, పెయింట్‌లు, ఇతర ద్రావకాలలో సాధారణంగా కనిపించే రసాయన సమ్మేళనాలైన ఫార్మాల్డిహైడ్, బెంజీన్, జిలీన్‌ వంటి కాలుష్య కారకాలను బోస్టన్ ఫెర్న్‌ ఇండోర్ మొక్కలు తొలగించగలవని కనుగొన్నారు. ఈ మొక్క ఆకులు ఇంట్లో పెంచుకుంటే గాలిలోని కాలుష్య కారకాలను గ్రహించడం ద్వారా గాలిని శుద్ధి చేస్తాయి, ఆపై వాటిని హానిచేయని ఉపఉత్పత్తులుగా విచ్ఛిన్నం చేస్తాయి, ఈ ప్రక్రియను ఫైటోరేమీడియేషన్ అంటారు.

Peace Lily - శాంతి కలువలు

పీస్ లిల్లీస్ మొక్కలను శాంతి కలువలు లేదా స్పాతిఫిలమ్ అని కూడా పిలుస్తారు, ఇవి గాలిలోని హానికరమైన కాలుష్యాలను తొలగించడంలో ప్రసిద్ధి చెందిన ఇంట్లో పెరిగే మొక్కలు. ఇవి ప్రత్యేకించి ఫర్నిచర్, తివాచీలు మొదలైన గృహోపకరణాలలో సాధారణంగా కనిపించే ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోథైలీన్‌ వంటి సమ్మేళనాలను తొలగించడంలోప్రభావవంతంగా ఉంటాయి.

Spider Plant -స్పైడర్ మొక్క

స్పైడర్ మొక్కలను క్లోరోఫైటమ్ కోమోసమ్ అని కూడా పిలుస్తారు, ఇవి గాలిని శుద్ధి చేయడంలో సహాయపడే ప్రసిద్ధమైన ఇండోర్ మొక్కలు. స్పైడర్ మొక్కలను మీ ఇంటి లోపల పెంచుకుంటే, అవి గాలి నుండి హానికరమైన కణాలను సమర్థవంతంగా తొలగిస్తాయి, ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్ , జిలీన్ వంటి అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) తొలగించగాలవు. ఈ సమ్మేళనాలు సాధారణంగా నిర్మాణానికి ఉపయోగించే వస్తువులు, గృహోపకరణాలలో కనిపిస్తాయి.

Snake Plant- స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్లు అద్భుతమైన గాలిని శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉన్నట్లు పరిశోధనలు తెలిపాయి. ఫార్మాల్డిహైడ్, బెంజీన్, జిలీన్, ట్రైక్లోరోఎథిలీన్‌లతో సహా గాలి నుండి వివిధ రకాల టాక్సిన్స్‌ను స్నేక్ ప్లాంట్లు తొలగిస్తాయని తేలింది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కారణం లేకుండా తలనొప్పి, మైకము, శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటుంటే, అందుకు మీ ఇంట్లో వీచే గాలి శుభ్రంగా లేదని అర్థం. ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుకుంటే అలాంటి సమస్యలు తలెత్తవు.

Aloe vera- కలబంద

కలబంద ఔషధ గుణాలకే కాకుండా, మనం పీల్చే గాలిని కూడా శుద్ధి చేసే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన మొక్క. అలోవెరా ముఖ్యంగా ఇంట్లో పేరుకుపోయిన ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి కాలుష్య కారకాలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

ఈ పైన పేర్కొన్న మొక్కలు గాలిని శుద్ధి చేయడంలో ఉత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. మీరు ఇంటి లోపల గదులలో, బాల్కనీలలో లేదా మీరు పనిచేసే డెస్క్ వద్ద వీటిని పెంచుకోవడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పీల్చవచ్చు, ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.