RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..-rrr re release date ram charan jr ntr rajamouli masterpiece movie on silver screen again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rrr Re-release Date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
May 06, 2024 10:05 PM IST

RRR Re-release date: ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ థియేటర్లలో రానుంది. గ్లోబల్ రేంజ్‍లో సెన్సేషనల్ హిట్ అయిన ఈ మూవీ మళ్లీ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. రీ-రిలీజ్ డేట్ ఖరారైంది.

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..
RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

RRR Re-release date: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బంపర్ హిట్ అయింది. ఈ మాస్టర్ పీస్ చిత్రంతో రామ్‍చరణ్, ఎన్టీఆర్‌ ఏకంగా గ్లోబల్ స్టార్స్ అయ్యారు. ఇంటర్నేషనల్ రేంజ్‍లో రాజమౌళి గుర్తింపు తెచ్చుకున్నారు. 2022 మార్చి 25న రిలీజైన ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‍బర్గ్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. చాలా దేశాల్లో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. బాక్సాఫీస్‍ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అలాంటి.. ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది.

రీ-రిలీజ్ డేట్

ఆర్ఆర్ఆర్ చిత్రం మే 10వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం మళ్లీ థియేటర్లలోకి రానుంది. 2డీ, 3డీ ఫార్మాట్లలో వస్తోంది.  మే 10న ఆర్ఆర్ఆర్ చిత్రం రీ-రిలీజ్‍లోనూ దుమ్మురేపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ (రౌద్రం, రణం, రుధిరం) చిత్రంలో కొమురం భీమ్‍గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‍చరణ్ యాక్టింగ్ వారెవా అనిపించింది. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ సీన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేశాయి. జక్కన్న విజన్, ఫిల్మ్ మేకింగ్‍కు అందరూ సలాం కొట్టారు.

ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు

ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లోనూ దుమ్మురేపింది. విదేశీ భాషల్లోనూ సత్తాచాటింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రానికి రూ.1,387 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంతకు మించి భారతీయ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు వచ్చింది.

ఆస్కార్ అవార్డ్

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లోనూ ఆర్ఆర్ఆర్ మూవీ మెరిసింది. ఈ మూవీలోని నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ ఫీచర్ మూవీగా ఆర్ఆర్ఆర్ చరిత్రకెక్కింది. ఈ కేటగిరీలో ఆస్కార్ దక్కించుకున్న తొలి ఆసియా మూవీగానూ నిలిచింది.

భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఆర్ఆర్ఆర్ మూవీని రాజమౌళి రూపొందించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‍చరణ్‍ హీరోలుగా చేయగా.. అజయ్ దేవ్‍గన్, ఆలియా భట్, శ్రీయా శరణ్, ఒలివియా మారిస్, సముద్ర ఖని, రే స్టీవెన్‍సన్, ఎడ్వర్డ్ సొనెన్‍బ్లిక్ కీలకపాత్రలు పోషించారు.

ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎంఎం కీరవాణి అందించిన సంగీతం కూడా అద్భుతం అనిపించింది. నాటునాటుకు గాను కీరవాణితో పాటు లిరిక్ రైటర్ చంద్రబోస్ కూడా ఆస్కార్ అందుకున్నారు. ఈ మూవీకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. 

రాజమౌళి తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కించనున్నారు. ఈ గ్లోబల్ రేంజ్ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలుకానుంది.