Ravi Teja Eagle: ఈ ఏడాది 50 సినిమాలు రిలీజ్.. ఆ ఓటీటీలో కూడా.. రవితేజ ఈగల్ నిర్మాత కామెంట్స్-ravi teja eagle producer tg vishwa prasad comments on 50 movies release in 2024 year ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja Eagle: ఈ ఏడాది 50 సినిమాలు రిలీజ్.. ఆ ఓటీటీలో కూడా.. రవితేజ ఈగల్ నిర్మాత కామెంట్స్

Ravi Teja Eagle: ఈ ఏడాది 50 సినిమాలు రిలీజ్.. ఆ ఓటీటీలో కూడా.. రవితేజ ఈగల్ నిర్మాత కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Feb 04, 2024 07:02 AM IST

Ravi Teja Eagle Producer TG Vishwa Prasad Comments: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ఈగల్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది 50 సినిమాలను విడుదల చేసి మైలు రాయిని అందుకుంటామని తెలిపారు. వాటిలో కొన్ని ప్రముఖ ఓటీటీలో కూడా రిలీజ్ అవుతాయని చెప్పారు.

ఈ ఏడాది 50 సినిమాలు రిలీజ్.. ఆ ఓటీటీలో కూడా.. రవితేజ ఈగల్ నిర్మాత కామెంట్స్
ఈ ఏడాది 50 సినిమాలు రిలీజ్.. ఆ ఓటీటీలో కూడా.. రవితేజ ఈగల్ నిర్మాత కామెంట్స్

TG Vishwa Prasad About 50 Movies In 2024 Year: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఈగల్ మూవీలో హీరో నవదీప్ సైతం కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే విడుదలైన ఈగల్ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పలు వాయిదాల తర్వాత ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ 'ఈగల్' సినిమా విశేషాలను లేటెస్ట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

'ధమాకా' తర్వాత రవితేజతో ఈగల్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది?

'ధమాకా' మాస్ ఎంటర్ టైనర్ ఐతే.. ‘ఈగల్’ చాలా క్లాసిక్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ బేస్ మాస్ ఉంది. ఈగల్ కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్‌ని అలరించే చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. కచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారు సరికొత్తగా కనిపించబోతున్నారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ అన్నీ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటాయి.

రవితేజ గారితోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి కారణం?

రవితేజ గారితో మాకు ఎక్స్‌ట్రార్డినరీ రిలేషన్‌షిప్ ఉంది. ఆ రిలేషన్‌షిప్‌తోనే ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాం. ఇక ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీని విడుదల తేదిని తర్వలోనే తెలియజేస్తాం. మేము ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చేయడం ఉండదు. కానీ, మేము ఓటీటీ‌లో బిగ్గర్ రోల్ ప్లే చేస్తాం.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ ఏడాది ఎన్ని సినిమాలు విడుదల కావచ్చు?

మినిమం 15 సినిమాలు విడుదల అవుతాయి. ఇవి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. ప్రొడక్షన్‌లో దాదాపు 6 చిత్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ కోసం కొన్ని చిత్రాలు నిర్మాణం అవుతున్నాయి. అలాగే దాదాపు నాలుగు సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రతి నెల మా నుంచి ఒక చిత్రం విడుదల కానుంది. ఈ ఏడాది 50 చిత్రాల మైలు రాయిని అందుకుంటామని భావిస్తున్నాం.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గురించి ?

కార్తీక్ ఘట్టమనేని గారితో ఎప్పటినుంచో మాకు మంచి అనుబంధం ఉంది. ధమాకా జరుగుతున్న సమయంలోనే ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాం. 'ఈగల్'ని అద్భుతంగా తీశారు. మా నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నాం. త్వరలోనే అనౌన్స్ చేస్తాం.

ఈగల్‌ని జనవరి13 చేయాలనుకున్నారు. ఇప్పుడు ఫిబ్రవరిలో 9న వస్తున్నారు. ట్రేడ్‌లో క్రేజ్ పెరిగిందని భావిస్తున్నారా?

తెలుగు చిత్ర పరిశ్రమ మేలుని ద్రుష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకున్నాం. ట్రేడ్ విషయానికి వస్తే అప్పుడు మేము సెకండ్ బెస్ట్.. ఇప్పుడు నెంబర్ వన్. మిగతా చిత్రాలు వేటి రీచ్ వాటికి ఉన్నాయి. ఇలా ఈగల్ మూవీ, తమ నిర్మాణ సంస్థలో వచ్చే సినిమాల గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

Whats_app_banner