YouTube Most Searched Videos 2023: యూట్యూబ్‌లో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన వీడియోలు ఇవే.. ఏడో స్థానంలో ధమాకా సాంగ్
YouTube Most Searched Videos 2023: ఇండియాలో యూట్యూబ్‌లో ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన వీడియోల లిస్టును రిలీజ్ చేశారు. ఇందులో ఓ భోజ్‌పురి పాట టాప్ లో ఉండటం విశేషం. ఏడో స్థానంలో రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా మూవీ సాంగ్ ఉంది.
YouTube Most Searched Videos 2023: గూగుల్ కు చెందిన యూట్యూబ్ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఓటీటీ. ఏ వీడియో కావాలన్నా ఇందులో సెర్చ్ చేస్తూ ఉంటారు. మరి ఇండియాలో 2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వీడియోలు ఏవో తెలుసుకోవాలని ఉందా? తాజాగా యూట్యూబ్ ఇండియా ఈ లిస్టును రిలీజ్ చేసింది.
టాప్ 15 మోస్ట్ సెర్చ్‌డ్ మ్యూజిక్ వీడియోస్ పేరుతో ఈ లిస్టును యూట్యూబ్ రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్, భోజ్‌పురి, తమిళ సినిమాలకు చెందిన పాటలు ఉన్నాయి. అయితే టాప్ ప్లేస్ లో మాత్రం ధనీ హో సబ్ ధన్ అనే ఓ భోజ్‌పురి పాట నిలవడం విశేషం. పవన్ సింగ్, శివానీ సింగ్ పాడిన ఈ పాటను ప్రియాన్షు సింగ్, అశుతోష్ తివారీ కంపోజ్ చేశారు.
ఇక రెండో స్థానంలో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన తేరే వాస్తే సాంగ్ ఉంది. జర హట్కే జర బచ్కే మూవీలోని ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ కలిసి నటించిన ఈ మూవీలోని తేరే వాస్తే పాటను సచిన్-జిగర్ కంపోజ్ చేశారు. ఈ పాట భాషతో సంబంధం లేకుండా దేశం మొత్తం మ్యూజిక్ లవర్స్ ఆదరించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీలోని కావాలయ్యా సాంగ్ ఈ లిస్టులో ఆరోస్థానంలో నిలవడం విశేషం. తమన్నా రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశాడు. శ్రేయా ఘోషాల్ తో కలిసి అతడే పాడాడు. తర్వాతి స్థానంలో రవితేజ, శ్రీలీల కలిసి నటించిన ధమాకా మూవీలోని పల్సర్ బైక్ సాంగ్ నిలిచింది.
భీమ్స్ సీసిరోలియో కంపోజ్ చేసి పాడిన ఈ పాట టాలీవుడ్ ను ఊపేసిన విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిన విజయ్ దళపతి మూవీ లియోలోని నా రెడీ సాంగ్ 11వ స్థానంలో ఉంది.