Navdeep: నటుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నవదీప్.. ఫ్యామిలీ నెం 1 గ్రాండ్ ఫినాలేలో అవార్డ్స్-zee telugu family no 1 grand finale and navdeep completes 20 years an actor ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee Telugu Family No 1 Grand Finale And Navdeep Completes 20 Years An Actor

Navdeep: నటుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నవదీప్.. ఫ్యామిలీ నెం 1 గ్రాండ్ ఫినాలేలో అవార్డ్స్

Sanjiv Kumar HT Telugu
Dec 07, 2023 12:31 PM IST

Zee Telugu Family No 1 Grand Finale: సరికొత్త కార్యక్రమాలతో అలరించే ప్రముఖ ఛానెల్ జీ తెలుగులోని ఫ్యామిలీ నెంబర్ వన్ షో గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. ఈ ఫినాలేలో నవదీప్ నటుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నాడు.

నటుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నవదీప్.. ఫ్యామిలీ నెం 1 గ్రాండ్ ఫినాలేలో అవార్డ్స్
నటుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నవదీప్.. ఫ్యామిలీ నెం 1 గ్రాండ్ ఫినాలేలో అవార్డ్స్

Navdeep At Family No 1 Grand Finale: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదారణ పొందుతున్న జీ తెలుగు రియాలిటీ షో ఫ్యామిలీ నెం.1 గ్రాండ్​ ఫినాలేకు చేరుకుంది. వారం వారం సరదాగా సాగే సరికొత్త ఆటలు, పోటీలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ కార్యక్రమం చివరి పోరుకి సిద్ధమైంది. తమ నటనతో తెరపై ప్రేక్షకులను అలరించే నటీనటులు కుటుంబ సమేతంగా పోటీపడిన ఈ షో ఆద్యంతం వినోదం పంచుతూ వీక్షకులను ఆకట్టుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఫ్యామిలీ నెం. 1 గ్రాండ్​ ఫినాలే పార్ట్​-1 ది బిగినింగ్​ అండ్ పార్ట్​-2 ది కన్​క్లూజన్​, డిసెంబర్​ 10, 17న (ఆదివారం) ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తూ సరదా పంచులతో వినోదాన్ని రెండింతలు చేస్తున్న యాంకర్​ రవి, రోహిణిల అదిరిపోయే ఎంట్రీతో గ్రాండ్​ ఫినాలే ఎపిసోడ్​​ ప్రారంభమవుతుంది. సద్దాం, రియాజ్​ల ప్రత్యేక సంభాషణ కార్యక్రమానికి మరింత హాస్యాన్ని జోడిస్తుంది.

అంతేకాదు, హీరో నవదీప్ ఎంట్రీ​ అద్భుతమైన డాన్స్​ పెర్మామెన్స్​ షోలోని పార్టిస్​పెంట్స్​తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తుదిపోరులో కృష్ణచైతన్య, సిద్ధు, మహేశ్వరి కుటుంబాల మధ్య మొదటి రౌండ్​లో పోటీపడతారు. ఈ ఎపిసోడ్‌లో నవదీప్​తో ఆడే ట్రూత్​ ఆర్​ డేర్​ గేమ్​ నవ్వులు పూయిస్తుంది. నవదీప్​ నటుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్​ కట్​ చేసి తన అనుభవాలు పంచుకున్నారు.

కడుపుబ్బా నవ్వించే కామెడీతోపాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలతో ఈ ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్​ ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుంది. ఇక, వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఫ్యామిలీ నెం.1 గ్రాండ్​ ఫినాలే పార్ట్-2: ది కన్​క్లూజన్​ కార్యక్రమం ఆరంభం నుంచి జరిగిన పలు సంభాషణలను, సంఘటనలను గుర్తుచేస్తూ అందరినీ తమ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ఈ ఎపిసోడ్​లో తాడు బొంగరం అవార్డ్స్​ని అందించనున్నారు.

ఇందులో భాగంగా బెస్ట్ ప్రోమో షాట్ ఆఫ్ ది సీజన్, క్వీన్ ఆఫ్ కంటెంట్, బెస్ట్ టిప్ ఆఫ్ ది సీజన్, బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆఫ్ ది సీజన్, బెస్ట్ డైలాగ్ ఆఫ్ ది సీజన్, నాన్ వెజ్ స్టార్ ఆఫ్ ది సీజన్, ఎవర్ గ్రీన్ ఆన్ స్క్రీన్ జోడీ ఆఫ్ ది సీజన్ వంటి కేటగిరీల్లో పలువురు కంటెస్టెంట్స్​ అవార్డులు అందుకున్నారు. ఫైనల్ రౌండ్‌లో సిద్ధు, ధరణిప్రియ, ధన్​రాజ్​ కుటుంబాల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.

వినోదం, భావోద్వేగాలు, సస్పెన్స్, థ్రిల్​.. మేళవింపుతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపే అంశాలతో ఈ గ్రాండ్​ ఫినాలే ఎపిసోడ్ మరచిపోలేని ముగింపును ఇవ్వనుంది. ఆద్యంతం సరదాగా సాగిన ఫ్యామిలీ నెం.1 గ్రాండ్ ఫినాలే వేడుకల్లో బబుల్ గమ్ మూవీ టీం కూడా భాగం కానుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్​లో విజయం సాధించి టైటిల్​ దక్కించుకునేందుకు కుటుంబాలు పోటాపోటీగా తలపడనున్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.