Seethe Ramudi Katnam: జీ తెలుగులో కొత్త సీరియల్ సీతే రాముడి కట్నం.. మారనున్న టైమింగ్స్-zee telugu telecast new serial seethe ramudi katnam from october 2nd 2023 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee Telugu Telecast New Serial Seethe Ramudi Katnam From October 2nd 2023

Seethe Ramudi Katnam: జీ తెలుగులో కొత్త సీరియల్ సీతే రాముడి కట్నం.. మారనున్న టైమింగ్స్

Sanjiv Kumar HT Telugu
Sep 27, 2023 03:32 PM IST

Seethe Ramudi Katnam Serial: జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్​ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు రెడీ అయింది. ఆసక్తికరమైన కథ, కథనంతో అత్తాకోడళ్ల మధ్య సాగే సరికొత్త సీరియల్​ ‘సీతే రాముడి కట్నం’ విశేషాల్లోకి వెళితే..

జీ తెలుగులో కొత్త సీరియల్ సీతే రాముడి కట్నం.. మారనున్న టైమింగ్స్
జీ తెలుగులో కొత్త సీరియల్ సీతే రాముడి కట్నం.. మారనున్న టైమింగ్స్

ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్​లతో సాగే సీరియల్స్​ను అందిస్తున్న జీ తెలుగు సీతే రాముడి కట్నం అనే మరో సీరియల్‍తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీరియల్లో అత్తాకోడళ్ల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధాన్ని కొత్త కోణంలో చూపించనున్నారు. అనుకోకుండా ముడిపడే సీతారాముల బంధం, సహజమైన అందంతో ఆత్మసంతృప్తికి ప్రాధాన్యమిచ్చే కోడలు, ఆకర్షించే బాహ్య సౌందర్యమే ప్రధానమైనదని భావించే అత్త మధ్య సాగే ఈ కథలోని మలుపులు సీరియల్​ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

సీత చుట్టూ

అనూహ్యమైన కథతో తెరకెక్కిన ‘సీతే రాముడి కట్నం’ అక్టోబర్​ 2న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఈ సీరియల్​ కథ నిరాడంబరత, నిష్కల్మషమైన మనసుతో నిజాయితీగా జీవించే సీత అనే సాధారణ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. సీత ఫ్యాషన్​పై అభిరుచి, మంచి నైపుణ్యంగల టైలర్​ కూడా. నిజాయితీపరుడైన రామ్ పోలీస్​ కావాలని కలలు కంటూ తన తల్లి ఆదేశం మేరకు తమ కుటుంబపరమైన వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటాడు.

ద్వేషించే పాత్ర

మహాలక్ష్మికి ఎన్నో వ్యాపారాలు ఉన్న కాస్మెటిక్ కంపెనీ అంటే చాలా ఇష్టం. అందానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మహాలక్ష్మి(రామ్​ తల్లి). తానెంతగానో ప్రేమించే తన కొడుకు భవిష్యత్తుపై కలలు కంటుంది. అందమైన అమ్మాయిని ఇచ్చి కొడుక్కి పెళ్లి చేయాలని ఆశపడుతుంది. అందంగా లేని దేన్నైనా ద్వేషించే మహాలక్ష్మి తనకు ఎంతమాత్రం నచ్చని సీతను కోడలుగా పొందుతుంది. మరి సీత తన అత్త మహాలక్ష్మిని ఎలా మెప్పిస్తుంది? అనేది తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారం కానున్న ‘సీతే రాముడి కట్నం’ సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే.

మారిన టైమింగ్స్

అయితే సీతే రాముడి కట్నం సీరియల్ రాకతో మిగతా సీరియల్స్​ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఊహలు గుసగుసలాడే మధ్యాహ్నం 3 గంటలకు, రాధకు నీవేరా ప్రాణం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారమవుతాయి. ఇక దేవతలారా దీవించండి సీరియల్​ సమాప్తం కానుంది.

నటీనటులు

కాగా సీతే రాముడి కట్నం సీరియల్‍ సీతా రామన్ అనే తమిళ ధారావాహికకు రీమేక్‍గా డబ్ చేశారు. ఇందులో హీరోగా తమిళ నటుడు సమీర్ చేస్తున్నాడు. తమిళ యాక్టర్ తెలుగు సీరియల్‍లో హీరోగా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఇక సీతగా.. వైష్ణవి చేస్తోంది. మహాలక్ష్మిగా బలమైన పాత్రలో పలు సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన మంజుల పరిటాల (డాక్టర్ బాబు నిరుపమ్ రియల్ వైఫ్) నటించడం విశేషం. ఇక, సీత తండ్రి శివకృష్ణ పాత్రలో ప్రముఖ నటుడు ఇంటూరి వాసు కనిపించనున్నారు.

IPL_Entry_Point