Ranga Ranga Vaibhavanga Teaser: యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌ రంగరంగ వైభవంగా టీజర్‌-ranga ranga vaibhavanga teaser is now number one in youtube trendings ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ranga Ranga Vaibhavanga Teaser: యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌ రంగరంగ వైభవంగా టీజర్‌

Ranga Ranga Vaibhavanga Teaser: యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌ రంగరంగ వైభవంగా టీజర్‌

HT Telugu Desk HT Telugu
Jun 28, 2022 04:53 PM IST

Ranga Ranga Vaibhavanga Teaser: వైష్ణవ్‌ తేజ్‌ లేటెస్ట్‌ మూవీ రంగరంగ వైభవంగా మూవీ టీజర్‌ సోమవారం రిలీజైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది.

వైష్ణవ్ తేజ్ నటించిన మూడో సినిమా ఇది
వైష్ణవ్ తేజ్ నటించిన మూడో సినిమా ఇది

మెగా కాంపౌండ్‌ హీరో వైష్ణవ్‌ తేజ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ రంగరంగ వైభవంగా. ఈ మూవీలో అతని సరసన కేతికా శర్మ నటిస్తోంది. సోమవారం (జూన్‌ 27) మేకర్స్‌ ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌ ఫ్యాన్స్‌కు చాలా బాగా నచ్చేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఇది టాప్‌లో ఉండటం విశేషం. రిలీజైన 24 గంటల్లోనే సుమారు 50 లక్షల వ్యూస్‌ వచ్చాయి.

తమ రంగరంగ వైభవంగా టీజర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉన్న విషయాన్ని మేకర్స్‌ వెంకటేశ్వర సినీ చిత్ర కూడా అధికారికంగా ట్విటర్‌లో వెల్లడించింది. ఈ మూవీ ఓ రొమాంటిక్‌ కామెడీ. ఇద్దరి మధ్యా ఎంతో ప్రేమ ఉన్నా.. అదే స్థాయిలో ఈగోలు కూడా ఉన్న ఓ జంట కథే ఈ మూవీ. ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ కాగానే చాలా మంది ఖుషీ మూవీలా ఉందే అని అనుకోవడం విశేషం.

ఉప్పెన మూవీతో అభిమానులను సంపాదించుకున్న వైష్ణవ్‌ తేజ్‌.. ఆ తర్వాత కొండ పొలం అనే ఓ వెరైటీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా నిరాశపరిచింది. దీంతో మళ్లీ కమర్షియల్‌ లవ్‌, కామెడీ ఫార్ములాను ఎంచుకొని వస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్