AP Mega DSC Notification 2024 : ఏపీ సర్కార్ శుభవార్త - 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ, త్వరలోనే నోటిఫికేషన్..!-mega dsc notification 2024 is going to be released in ap with 16347 posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mega Dsc Notification 2024 : ఏపీ సర్కార్ శుభవార్త - 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ, త్వరలోనే నోటిఫికేషన్..!

AP Mega DSC Notification 2024 : ఏపీ సర్కార్ శుభవార్త - 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ, త్వరలోనే నోటిఫికేషన్..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 13, 2024 05:18 PM IST

AP Mega DSC Notification 2024 Updates: ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్… టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశారు.

ఏపీలో మెగా డీఎస్సీ
ఏపీలో మెగా డీఎస్సీ

AP Mega DSC Notification 2024 : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు ఏపీలోని కొత్త ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే… మెగా డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఇందులో భాగంగా….16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసే ఛాన్స్ ఉంది…!

yearly horoscope entry point

కొత్తగా వచ్చే మెగా డీఎస్సీలో ఎస్జీటీలు-6371, పీఈటీలు -132, ఎస్ఏలు-7725, టీజీటీలు-1781, పీజీటీ-286, ప్రిన్సిపాల్స్-52 పోస్టులు ఉండనున్నాయి. అధికారికంగా నోటిఫికేషన్ రావాల్సి ఉంది.

గత నోటిఫికేషన్ ప్రకారం 6100 పోస్టులే….!

ఈ ఏడాది మొదట్లో వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 6,100 పోస్టుల భర్తీ చేస్తేందుకు సిద్ధమైంది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ), 2,299 స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్‌ పోస్టులు ఉన్నాయి.

డీఎస్సీతో పాటే టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. వీటికి సంబంధించి షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. అయితే టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం లేకపోవటంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా పడింది. వెంటనే కొత్త షెడ్యూల్ ను కూడా విద్యాశాఖ ప్రకటించింది. మరోవైపు టెట్ పరీక్షలను నిర్వహించింది. వీటికి సంబందించి ప్రాథమిక కీలు కూడా వచ్చాయి. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో…. డీఎస్సీతో పాటు టెట్ ఫలితాల విడుదలకు బ్రేకులు పడ్డాయి. దీంతో అప్పట్నుంచి ఎన్నికల కోడ్ ఎత్తివేసే వరకు ప్రక్రియ అంతా ఆగిపోయింది.

టెట్ ఫలితాలు…!

ఏపీ టెట్ ఫలితాల కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో ఏ క్షణమైనా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ‌ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు మార్చి 9న ముగిశాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి

ముందుగా విడుదల చేసి‌న షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఏపీ టెట్ ఫలితాలు విడుదల కాావాల్సిఉంది. కానీ ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఏపీ టెట్ ఫలితాలు విడుదలకు బ్రేక్ పడింది.‌ దీంతో ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఫలితాలను బట్టీ డీఎస్సీకి ప్రిపేర్ అవ్వడంపై ఒక స్పష్టత వస్తుందని‌ భావిస్తున్నారు‌.

16వేలకు పైగా టీచర్ పోస్టులతో కూడిన దస్త్రంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతకం చేసిన నేపథ్యంలో…. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి విద్యాశాఖ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. తెలంగాణలోనూ ముందుగా ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి…. పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూలైలో నిర్వహించనున్నారు.

Whats_app_banner