Darshan: ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్.. పోలీసులను అడుక్కున్న కన్నడ స్టార్ హీరో దర్శన్-kannada challenging star darshan asks cigarette to police renuka swamy murder case actress pavithra gowda affair ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Darshan: ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్.. పోలీసులను అడుక్కున్న కన్నడ స్టార్ హీరో దర్శన్

Darshan: ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్.. పోలీసులను అడుక్కున్న కన్నడ స్టార్ హీరో దర్శన్

Sanjiv Kumar HT Telugu
Jun 13, 2024 02:44 PM IST

Hero Darshan Ask Cigarette Police: కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పరిస్థితి దారుణంగా మారినట్లు తెలుస్తోంది. రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులను సిగరెట్ అడుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్.. పోలీసులను అడుక్కున్న కన్నడ స్టార్ హీరో దర్శన్
ఒక్క సిగరెట్ ఇవ్వండి ప్లీజ్.. పోలీసులను అడుక్కున్న కన్నడ స్టార్ హీరో దర్శన్

Kannada Hero Darshan Murder Case: కన్నడ నాట అగ్ర హీరోగా, ఛాలెంజింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు దర్శన్ తూగుదీప్. అభిమానులు ఎంతగానో అభిమానించే తమ హీరో దర్శన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారినట్లు తెలుస్తోంది. తన అభిమాని అయిన రేణుకా స్వామి హత్య కేసులో ఇటీవల హీరో దర్శన్ అరెస్ట్ అయ్యాడు.

దర్శన్‌తోపాటు 13 మందిని కర్ణాటకోలోని కామాక్షి పాల్యా పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకా స్వామి హత్య కేసులో (Renuka Swamy Murder Case) రెండవ నిందితునిగా ఉన్న దర్శన్‌కు వ్యతిరేకంగా బుధవారం ప్రజల ధర్నాలతో అట్టుడుకినట్లు సమాచారం. అభిమాని రేణుకా స్వామి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వందలాది మంది కోరుతూ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు చేరి దర్శన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంతేకాకుండా దర్శన్ ఫొటోకు చెప్పుల హారం వేసి ఊరేగించి దగ్ధం చేశారు. ఈ దర్నాలో మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి పాల్గొన్నారు. సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసిన దర్శన్ నిజ జీవితంలో విలన్‌గా మారడం విషాదకరమని తిప్పారెడ్డి అన్నారు. రేణుకా స్వామితో ఇబ్బింది ఉంటే తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయాల్సిందని, ఇలా అమానుషంగా హత్య చేయడం కరెక్ట్ కాదని, హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం దర్శన్‌తో సహా 13 మంది నిందితులు అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. పోలీస్ స్టేషన్‌లో దిగాలుగా కూర్చున్న దర్శన్ పోలీసులను ఒక్క సిగరెట్ ఇవ్వాలని వేడుకున్నట్లు సమాచారం. సిగరెట్ లేక చేతులు వణుకుతున్నాయని, ప్లీజ్ అంటూ దర్శన్ అడుక్కున్నాడట. కానీ, పోలీసులు మాత్రం సిగరెట్ ఇవ్వలేదని తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను హత్య చేయమని ఎవరికీ చెప్పలేదని పోలీసులతో దర్శన్ పదే పదే చెబుతున్నాడని సమాచారం అందింది. ఠాణాలో నిద్ర లేని రాత్రి గడిపిన దర్శన్ పండ్ల జ్యూస్, ఇడ్లీలు ఇచ్చిన తినకుండా మేలుకునే ఉన్నట్లు సమాచారం. దొన్నె బిర్యాని ఇచ్చిన దర్శన్ వద్దనగా.. పవిత్ర, మిగతా నిందితులు బిర్యాని ఆరగించారట. 6 రోజులపాటు దర్శన్ పోలీస్ కస్టడీలో ఉండునున్నారు.

కాగా.. దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి మైసూరులోని కామాక్షి పాల్యాలో ఓ షెడ్‌లో విగతజీవిగా కనిపించాడు. ముందుగా పోలీసులు రేణుకా స్వామి సూసైడ్ చేసుకున్నారని భావించారు. కానీ, తర్వాత అది హత్య అని, దానిలో హీరో దర్శన్‌కు భాగముందని, అందుకు కారణం నటి పవిత్రా గౌడతో (Pavithra Gowda) ఎఫైర్ అని పోలీసులు తేల్చారు. గతంలో పవిత్ర గౌడతో దర్శన్‌కు మధ్య ఇల్లీగల్ రిలేషన్‌షిప్ ఉందని ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయమై పవిత్రపై దర్శన్ భార్య విజయ లక్ష్మీ (Vijaya Lakshmi Darshan) బహిరంగంగానే పోస్టులు పెడుతూ దూషించింది. అయినా దర్శన్, పవిత్ర తీరులో మార్పు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న రేణుకా స్వామి దర్శన్‌కు కామెంట్ రూపంలో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. వారి రిలేషన్‌కు సంబంధించి తన భార్యకు చెబుతానని, పద్ధతి మార్చుకోవాలని రేణుకా స్వామి చెప్పినట్లు పలు కథనాలు వచ్చాయి.

WhatsApp channel