Nandita Swetha: నందితా శ్వేత హారర్ కామెడీ మూవీ రిలీజ్ డేట్ ఛేంజ్ - థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
Nandita Swetha: వెన్నెలకిషోర్ హీరోగా నటిస్తోన్న ఓ మంచి ఘోస్ట్ రిలీజ్ డేట్ మారింది. జూన్ 14న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వారం వాయిదాపడింది. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Nandita Swetha: వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ మూవీ ఓ మంచి ఘోస్ట్ (ఓఎమ్‌జీ) రిలీజ్ డేట్ మారింది. వారం రోజులు ఈ మూవీ వెనక్కి వెళ్లింది. తొలుత ఓ మంచి ఘోస్ట్ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ మూవీ వారం పాటు వాయిదాపడింది. జూన్ 21న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కొత్త రిలీజ్ డేట్‌ను గురువారం దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఓ మంచి ఘోస్ట్ మూవీకి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు.
టాలీవుడ్ కమెడియన్స్
ఓ మంచి ఘోస్ట్ సినిమాలో వెన్నెలకిషోర్, నందితా శ్వేతతో పాటు టాలీవుడ్ కమెడియన్స్ షకలక శంకర్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఓల్డ్ బిల్డింగ్‌లో అడుగుపెట్టిన కొంతమంది ఓ దెయ్యం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే పాయింట్‌తో ఈ సినిమా సాగనున్నట్లు టీజర్‌లో చూపించారు. రివేంజ్ హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
ఓటీటీ డీల్ క్లోజ్
ఓ మంచి ఘోస్ట్ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో వెన్నెలకిషోర్ క్యారెర్టర్ నవ్విస్తుందని, నందితా శ్వేత క్యారెక్టర్ భయపెడుతుందని మేకర్స్ చెబుతోన్నారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా ముగిసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హీరోగా...కమెడియన్‌గా...
చారి 111 మూవీతో ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వెన్నెలకిషోర్. స్పై కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నా ఓటీటీలో మాత్రం హిట్టయ్యింది. అమెజాన్ ప్రైమ్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్
చారి 111 తర్వాత వెన్నెలకిషోర్ హీరోగా శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ పేరుతో ఓ డిటెక్టివ్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ మూవీలో అనన్యా నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కమెడియన్‌గా తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నాడు వెన్నెలకిషోర్. గేమ్ ఛేంజర్, విశ్వంభరతో పాటు పలు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోన్నాడు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఇండియన్ 2 మూవీతో వెన్నెల కిషోర్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఎక్కువగా హారర్ సినిమాలు…
మరోవైపు. నందితా శ్వేత ఇప్పటివరకు తెలుగులో ఎక్కువగా హారర్ సినిమాలు చేసింది.ప్రేమకథా చిత్రమ్ 2, ఎక్కడికి పోతావు చిన్నవాడాతో పాటు పలు సినిమాల్లో దయ్యం పాత్రల్లో కనిపించింది. ఓ మంచి ఘోస్ట్‌లో కూడా ఆమె దయ్యం క్యారెక్టర్ చేయబోతున్నది.
టాపిక్