Gangs of Godavari OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..
Gangs of Godavari OTT Release: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే రేపు (జూన్ 14) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది.
Gangs of Godavari OTT: రూరల్ యాక్షన్ డ్రామా మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి కలెక్షన్లనే దక్కించుకుంది. మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ నటించిన ఈ చిత్రం మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ట్రైలర్‌తో ఈ మూవీకి చాలా హైప్ వచ్చింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చినా.. వసూళ్లను మాత్రం బాగానే రాబట్టింది. అయితే, ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అప్పుడే ఓటీటీలోకి అడుగుపెట్టేస్తోంది. రేపే (జూన్ 14) స్ట్రీమింగ్‍కు రానుంది.
స్ట్రీమింగ్ వివరాలు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా 'నెట్‍ఫ్లిక్స్' ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మరికొన్ని గంటల్లో ఈ అర్ధరాత్రి (జూన్ 14) నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలుకానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తోంది.
15 రోజుల్లోనే..
మే 31న థియేటర్లలో రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా 15 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. జూన్ ఆఖరి వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే, అందుకు రెండు వారాలు ముందుగానే జూన్ 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు
మంచి హైప్‍తో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి సూపర్ ఓపెనింగ్ దక్కింది. తొలి రోజే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.8.2 కోట్లతో దుమ్మురేపింది. గామి తర్వాత విశ్వక్‍కు ఇదే భారీ ఓపెనింగ్ అయింది. అయితే, కాస్త మిశ్రమ స్పందన రావటంతో ఆ తర్వాత వసూళ్లు కాస్త డ్రాప్ అయ్యాయి. మొత్తంగా సుమారు రూ.25కోట్ల కలెక్షన్లను రాబట్టి ఈ బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్సే చేసిందని అంచనాలు ఉన్నాయి.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో లంకల రత్నాకర్ అలియాజ్ టైగర్ రత్న పాత్రలో విశ్వక్‍సేన్ యాక్షన్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‍గా నటించారు. అంజలి ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. నాజర్, సాయికుమార్, గోపరాజు రమణ, మధుసూధన్, హైపర్ ఆది, పృథ్విరాజ్ కీలకపాత్రల్లో కనిపించారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో లోకల్ పాలిటిక్స్‌తో ఈ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.
విశ్వక్ నెక్స్ట్ మూవీ ఇదే
ప్రస్తుతం విశ్వక్‍సేన్ హీరోగా మెకానిక్ రాకీ మూవీ రూపొందుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి తేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ప్రొడ్యూజ్ చేస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ మ్యూజిక్ ఇస్తున్నారు.