Devara Release Date: అఫీషియల్: దేవర రిలీజ్ డేట్ మారింది.. ముందుగానే వస్తున్న ఎన్టీఆర్ సినిమా-devara movie gets new release date jr ntr action film to release sooner devara on september 27 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Release Date: అఫీషియల్: దేవర రిలీజ్ డేట్ మారింది.. ముందుగానే వస్తున్న ఎన్టీఆర్ సినిమా

Devara Release Date: అఫీషియల్: దేవర రిలీజ్ డేట్ మారింది.. ముందుగానే వస్తున్న ఎన్టీఆర్ సినిమా

Devara New Release Date: దేవర సినిమా విడుదల తేదీ మళ్లీ మారింది. రిలీజ్‍ను ప్రీ-పోన్ చేశారు మేకర్స్. దీంతో మరింత ముందుగానే రానుంది. కొత్త రిలీజ్ డేట్‍పై నేడు అధికారిక ప్రకటన వచ్చింది.

Devara New Release Date: అఫీషియల్: దేవర రిలీజ్ డేట్ మారింది.. ముందుగానే వస్తున్న ఎన్టీఆర్ సినిమా

Devara Release Date: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు దేవర మూవీ కోసం ఎదురుచూస్తున్న అందరికీ గుడ్‍న్యూస్ ఇది. దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారింది. అయితే ఈసారి వాయిదా కాకుండా ప్రీ-పోన్ అయింది. అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు గతంలో ప్రకటించిన మూవీ టీమ్ ఇప్పడు దీన్ని మార్చింది. అందుకు రెండు వారాలుగా ముందుగానే దేవర మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. కొత్త విడుదల తేదీన మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

కొత్త రిలీజ్ డేట్ ఇదే

దేవర సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ కొత్త రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ నేడు (జూన్ 13) అధికారికంగా వెల్లడించింది. “అతడు ముందుగానే వస్తుండడంపై అన్ని తీర ప్రాంతాలకు హెచ్చరిక పంపుతున్నాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి వస్తుంది” అని మూవీ టీమ్ వెల్లడించింది. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో మూవీ తెరకెక్కుతుండటంతో ఇలా ప్రకటించింది. దేవర కొత్త రిలీజ్ డేట్‍తో ఓ పోస్టర్ కూడా ట్వీట్ చేసింది మూవీ టీమ్.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కావాల్సింది. అయితే, ఆ చిత్రం వాయిదా పడడం ఖాయమైంది. దీంతో ఆ తేదీకి ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర వచ్చేస్తోంది. ఈ విషయంపై కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. ఈ చిత్రం ముందుగానే వస్తుందంటూ సమాచారం వచ్చింది. అయితే, సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అవుతుందని నేడు మూవీ టీమ్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టైయాన్’ చిత్రం అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం దేవ అక్టోబర్ 11న విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రాల నుంచి పోటీ లేకుండా సెప్టెంబర్ 27వ తేదీని దేవర ఫిక్స్ చేసుకుంది. దేవర చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావటంతో పాన్ ఇండియా రేంజ్‍లో దేవరకు క్రేజ్ ఉంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం భారీగా కలెక్షన్లు దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

జోరుగా షూటింగ్

హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా దేవర చిత్రం రానుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. గోవాలో ఇటీవలే ఓ సుదీర్ఘ షెడ్యూల్ ముగిసింది. త్వరలోనే మరో షెడ్యూల్ షురూ కానుంది. జూలై నెలాఖరు లేకపోతే ఆగస్టు మొదట్లో దేవర షూటింగ్‍ను పూర్తి చేయాలని మూవీ టీమ్ టార్గెట్‍గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

దేవర చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో కీరోల్స్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫియర్ సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‍తో నిర్మిస్తున్నాయి.