Prabhas OTT: ఓటీటీలో ప్రభాస్ సినిమాలతో పెరిగిన ఆ ట్రెండ్.. నిర్మాతలకు ఎన్నో రెట్ల లాభాలు!-prabhas movies increase ott trend by buying two digital streaming platforms south language and hindi version ott rights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Ott: ఓటీటీలో ప్రభాస్ సినిమాలతో పెరిగిన ఆ ట్రెండ్.. నిర్మాతలకు ఎన్నో రెట్ల లాభాలు!

Prabhas OTT: ఓటీటీలో ప్రభాస్ సినిమాలతో పెరిగిన ఆ ట్రెండ్.. నిర్మాతలకు ఎన్నో రెట్ల లాభాలు!

Sanjiv Kumar HT Telugu
Nov 02, 2024 08:26 AM IST

Prabhas Movies Hindi Regional OTT Rights: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలతో ఓటీటీలో ఓ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ప్రభాస్‌తో సినిమాలు చేసిన నిర్మాతలకు ఎన్నో రెట్ల లాభాలు వస్తున్నాయి. ప్రభాస్ మూవీస్ ఓటీటీ ట్రెండ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో ప్రభాస్ సినిమాలతో పెరిగిన ఆ ట్రెండ్.. నిర్మాతలకు ఎన్నో రెట్ల లాభాలు!
ఓటీటీలో ప్రభాస్ సినిమాలతో పెరిగిన ఆ ట్రెండ్.. నిర్మాతలకు ఎన్నో రెట్ల లాభాలు!

Prabhas OTT Trend: ప్రాంతీయ సినిమా హద్దులు దాటి పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిన స్టార్ హీరోస్ చాలా కొద్దిమందే కనిపిస్తారు. అలాంటి వారిలో తెలుగు నుంచి ప్రముఖంగా, మొదటిగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ గురించి. తన బ్లాక్ బస్టర్ సినిమాలు, రికార్డ్ బాక్సాఫీస్ వసూళ్లతో అందరిలో ముందు నిలుస్తున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్.

yearly horoscope entry point

మరే స్టార్ అందుకోలేనంతగా

బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా జర్నీ రీసెంట్‌గా కల్కి 2898 ఏడీతో దిగ్విజయంగా కొనసాగుతోంది. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్.. ఇలా ఏ విషయంలో చూసినా ప్రభాస్ తప్పా మరే స్టార్ హీరో అందుకోలేనంత స్థాయికి చేరుకున్నారు.

ప్రభాస్ క్రేజ్

ఇక ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ స్టార్స్‌తో పోటీ పడేంతగా నార్త్‌లో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా ఉత్తరాది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎంతలా అంటే 28 ఏళ్లపాటు కంటిన్యూగా షారుక్ ఖాన్ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా ఆడే మరాఠా మందిర్‌లో ప్రభాస్ సలార్ మూవీ స్క్రీన్ చేసేంతగా డార్లింగ్ క్రేజ్ సంపాదించుకున్నారు.

ఓవర్సీస్‌లోనూ రికార్డ్ కలెక్షన్స్

అందుకే బాలీవుడ్‌లో తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ప్రభాస్. తమిళ, మలయాళ, కన్నడలోనూ స్థానిక స్టార్ హీరోలతో ప్రభాస్ సినిమాలు పోటీ పడటం నిజమైన పాన్ ఇండియా ట్రెండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఓవర్సీస్‌లోనూ ప్రభాస్ ఆకర్షణకు తిరుగులేదు. ఆయన సలార్, కల్కి సినిమాలు ఓవర్సీస్‌లో వసూళ్లలో చరిత్ర సృష్టించాయి.

డిఫరెంట్ ఓటీటీల్లో

ఇక డిజిటల్ అంటే ఓటీటీ మార్కెట్‌లో హిందీ, రీజనల్‌గా సెపరేట్ హక్కుల్ని తీసుకునే ట్రెండ్ ప్రభాస్ సినిమాలతో మరింతగా పెరిగింది. అంతకుముందు హిందీ వెర్షన్, సౌత్ లాంగ్వెజెస్ వెర్షన్‌ ఓటీటీ రైట్స్‌ను ఒకే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసేవి. ఏదైనా ఉంటే అరకొరగా ఏవైనా హాలీవుడ్ సినిమాల హిందీ, తెలుగు వెర్షన్స్‌ డిఫరెంట్ ఓటీటీల్లో వచ్చేవి.

ప్రభాస్ మూవీస్ ద్వారా

కానీ, ఈ మధ్య చాలా వరకు సినిమాల తెలుగు, హిందీ వెర్షన్స్ ఓటీటీ రైట్స్‌ను డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ ఓటీటీ ట్రెండ్ పెరిగింది ప్రభాస్ సినిమాల ద్వారానే. ప్రభాస్ మూవీస్ ద్వారానే అటు హిందీ వెర్షన్ ఒక ఓటీటీలో దక్షిణాది భాషల వెర్షన్ మరో ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అవడం పెరిగింది.

ఎన్నో రెట్ల లాభాలు

ఉదాహరణకు చూస్తే.. సలార్ హిందీ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తీసుకోగా, రీజనల్ లాంగ్వేజ్‌లు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కల్కి 2898 ఏడీ సినిమా హిందీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకోగా, అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రైట్స్ కొనుగోలు చేసింది. ఇలా థియేట్రికల్, ఓటీటీ, ఇతర బిజినెస్‌ల ద్వారా ప్రభాస్ సినిమాలు నిర్మాణ వ్యయానికి ఎన్నో రెట్ల లాభాలు ఆర్జిస్తున్నాయి.

రెండు ఓటీటీలు కావడంతో

అంటే, థియేట్రికల్ పక్కన పెడితే ఓటీటీలో ఒక్క సినిమానే అయినప్పటికీ డిఫరెంట్ లాంగ్వెజ్ వెర్షన్స్‌ను రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు చేయడంతో నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ వస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ప్రభాస్ సినిమాలు నిర్మాతలకు బెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొస్తున్నాయి.

ప్రభాస్ మూవీస్ లైనప్

ఇదిలా ఉంటే, ప్రభాస్ ప్రస్తుతం తన ప్రాంఛైజీ సినిమాలతో భారీ పాన్ వరల్డ్ లైనప్ చేసుకున్నారు. ప్రభాస్ రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే, సీతా రామం డైరెక్టర్ హను రాఘవపూడితో ప్రభాస్ ఫౌజీ అనే కొత్త సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫౌజీ మూవీ పూజా కార్యక్రమం ఇటీవలే ప్రారంభమైంది.

Whats_app_banner