Ka Movie Box Office: బాక్సాఫీస్ దగ్గర కనీసం 3 వారాలకు ఢోకా లేదంటున్నారు.. క మూవీపై డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్
Distributor About Ka Movie Box Office: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమాకు రెస్పాన్స్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో క మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో క బాక్సాఫీస్‌పై డిస్ట్రిబ్యూటర్ వంశీ కామెంట్స్ చేశారు.
Distributor About Ka Movie Box Office: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన లేటెస్ట్ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం క. నయన్ సారి, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 31న దివాళీ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. గురువారం విడుదలైన క మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ నేపథ్యంలో క మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరంతోపాటు హీరోయిన్లు తన్వీ రామ్, నయన్ సారిక, నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి, డైరెక్టర్స్ సుజీత్, సందీప్, తెలుగు డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ఇతర సినిమా టీమ్ మెంబర్స్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి క మూవీ బాక్సాఫీస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హౌస్ ఫుల్ షోలు
"క సినిమాకు అన్ని ఏరియాల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని సెంటర్స్‌లో 80 పర్సెంట్ ఫుల్స్ అవుతున్నాయి. ఫస్ట్ షో, సెకండ్ షో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. నైజాంతో పాటు ఆంధ్రా, సీడెడ్ అద్భుతంగా రెస్పాన్స్ ఉంది. 18 ప్రీమియర్స్‌తో మేము స్టార్ట్ చేస్తే అది 71 షోస్‌కు వెళ్లింది. ఈ 71 షోస్‌లో 56 షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి" అని డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి తెలిపారు.
అలా నెంబర్స్ వస్తున్నాయి
"8 క్లాక్ షోకి 7 గంటలకు బుకింగ్స్ ఓపెన్ చేసినా టికెట్స్ క్లోజ్ అయ్యాయి. మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా క సినిమా ఏ రేంజ్‌కు వెళ్తుందో ఇప్పడే చెప్పలేం అంటున్నారు. అలా నెంబర్స్ వస్తున్నాయి. కనీసం 3 వారాలు బాక్సాఫీస్ దగ్గర క సినిమాకు ఢోకా లేదని చెబుతున్నారు. నా కెరీర్‌లోనే ఇలాంటి ది బెస్ట్ ఫిలిం ఇచ్చిన ప్రొడ్యూసర్ గోపి గారికి, హీరో కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్న" అని డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి పేర్కొన్నారు.
ఇదే ఎగ్జాంపుల్
ఇదే కార్యక్రమంలో దర్శకుడు సందీప్ మాట్లాడుతూ.. "కంటెంట్ బాగున్న సినిమాలు వస్తే మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పేందుకు క లేటెస్ట్ ఎగ్జాంపుల్ . కొత్తగా సినిమాను చేస్తే మన ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. ముందు ఇలాంటి కొత్త కథను యాక్సెప్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం" అని అన్నారు.
నెగెటివ్ కామెంట్స్ వస్తే
"ఈ రోజు మా సినిమాను ప్రేక్షకులు ఎంతగా రిసీవ్ చేసుకున్నారంటే ఎవరైనా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడితే వారికి ప్రేక్షకులే సమాధానం ఇస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చుకునే ఇంకా మంచి స్క్రిప్ట్స్‌తో సినిమాలు చేయాలనుకుంటున్నాం" అని క మూవీ డైరెక్టర్స్‌లో ఒకరైన సందీప్ చెప్పారు.
టికెట్స్ ఇవ్వలేనంతగా
నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. "క సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. టికెట్స్ కోసం నాకు ఎన్నో ఫోన్స్ వస్తున్నాయి. టికెట్స్ ఇవ్వలేనంతగా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. అంత బ్లాక్ బస్టర్ సినిమా చేశాం. సినిమాకు పడిన కష్టం ఈ ఘన విజయంతో మర్చిపోతున్నాం. మా సంస్థకు ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన హీరో కిరణ్ గారికి, డైరెక్టర్స్ సుజీత్, సందీప్, డిస్ట్రిబ్యూటర్ వంశీ, ఇతర టీమ్ మెంబర్స్‌కు థ్యాంక్స్" అని పేర్కొన్నారు.