OTT Movies: ఈ వారం ఓటీటీలో 18 సినిమాలు- కల్కి 2898 ఏడీతోపాటు 3 మాత్రమే చాలా స్పెషల్- ఎందుకు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?-ott movies release this week on netflix amazon prime hotstar kalki 2898 ad ott release raayan ott streaming grrr ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies: ఈ వారం ఓటీటీలో 18 సినిమాలు- కల్కి 2898 ఏడీతోపాటు 3 మాత్రమే చాలా స్పెషల్- ఎందుకు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

OTT Movies: ఈ వారం ఓటీటీలో 18 సినిమాలు- కల్కి 2898 ఏడీతోపాటు 3 మాత్రమే చాలా స్పెషల్- ఎందుకు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 19, 2024 02:30 PM IST

OTT Movies Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 18 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కేవలం రెండు మాత్రమే చాలా స్పెషల్ కానున్నాయి. వాటిలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ కూడా ఉంది. దీంతోపాటు మరో 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏ ఓటీటీలో రిలీజ్ కానున్నాయో లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో 18 సినిమాలు- కల్కి 2898 ఏడీతోపాటు 3 మాత్రమే చాలా స్పెషల్- ఎందుకు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఈ వారం ఓటీటీలో 18 సినిమాలు- కల్కి 2898 ఏడీతోపాటు 3 మాత్రమే చాలా స్పెషల్- ఎందుకు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

This Week OTT Movies: ఈ వారం థియేటర్లలో మారుతి నగర్ సుబ్రమణ్యం, డీమోంటీ కాలనీ 2 వంటి రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ కానున్నాయి. అయితే, ఓటీటీల్లో మాత్రం రెండు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. వాటితోపాటు ఓ మలయాళ సర్వైవల్ కామెడీ సినిమా కూడా ప్రత్యేకం కానుంది.

ఈ వారం అంటే ఆగస్ట్ 19 నుంచి 25 వరకు ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 18 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కేవలం మూడు మాత్రమే చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

టెర్రర్ ట్యూజ్‌డే: ఎక్స్‌ట్రీమ్ (థాయ్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 20

కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ హిందీ వెర్షన్)-ఆగస్ట్ 22

జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 22

మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 22

ప్రెట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ది మూవీ పార్ట్ 1 (జపనీస్ సినిమా)- ఆగస్ట్ 22

ఇన్‌కమింగ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 23

ది ఫ్రాగ్ (కొరియిన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 23

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ

యాంగ్రీ యంగ్ మ్యాన్: ది సలీం జావేద్ స్టోరీ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 20

కల్కి 2898 ఏడీ (తెలుగు మూవీ)- ఆగస్ట్ 22

ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 23

రాయన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)- ఆగస్ట్ 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- ఆగస్ట్ 20

ది సుప్రీమ్ ఎట్ ఎర్ల్స్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 23

మరిన్ని ఓటీటీ మూవీస్

ఉనర్వుగల్ తొడరకథై (తమిళ చిత్రం)- ఆహా ఓటీటీ- ఆగస్ట్ 23

డ్రైవ్ అవే డాల్స్ (ఇంగ్లీష్ సినిమా)- జియో సినిమా ఓటీటీ- ఆగస్ట్ 23

పచింకో సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- ఆగస్ట్ 23

ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఆగస్ట్ 23

స్వకార్యం సంభవబాహులం (మలయాళ సినిమా)- మనోరమ ఓటీటీ- ఆగస్ట్ 23

ప్రధానంగా చెప్పుకునేది

ఇలా ఈ వారం ఓటీటీల్లో 18 వరకు సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చాలా ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా కల్కి 2898 ఏడీ. ప్రభాస్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ఈవారానికే అతిపెద్ద స్పెషల్ మూవీ కానుంది.

రాయన్ కూడా

కల్కి తర్వాత మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రాయన్ కూడా చాలా స్పెషల్ సినిమా. ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగు, ఇతర సౌత్ లాంగ్వెజెస్‌లోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

సర్వైవల్ కామెడీ మూవీ

ఈ రెండు సినిమాలతోపాటు ఓ మలయాళ చిత్రం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. మలయాళ కామెడీ సర్వైవల్ మూవీ గర్‌ర్‌ర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ఇలా ఈ వారం 18లో కేవలం మూడు మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ చిత్రాలు ఉన్నాయి.