Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- శ్రావణ శుక్రవారం స్పెషల్- చూడాల్సినవి 4 మాత్రమే- ఎక్కడంటే?-today ott movies releases on netflix amazon prime jio cinema aha ott friday ott movies evol ott release pearl ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- శ్రావణ శుక్రవారం స్పెషల్- చూడాల్సినవి 4 మాత్రమే- ఎక్కడంటే?

Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- శ్రావణ శుక్రవారం స్పెషల్- చూడాల్సినవి 4 మాత్రమే- ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 16) నాడు ఏకంగా 11 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో హారర్, బోల్డ్, సూపర్ హీరో జోనర్ సినిమాలతోపాటు కామెడీ వెబ్ సిరీస్ స్పెషల్‌గా కానుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- శ్రావణ శుక్రవారం స్పెషల్- చూడాల్సినవి 4 మాత్రమే- ఎక్కడంటే?

Today OTT Releases: ఈ వారం ఓటీటీలో మంచి సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇండిపెండెన్స్ డే, శ్రావణ శుక్రవారం కారణంగా వచ్చిన సెలవులను ఉపయోగించుకునేలా ఈ వారంలో 23కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో ఇవాళ ఒక్కరోజే అంటే శ్రావణ శుక్రవారం (ఆగస్ట్ 16) సందర్భంగా ఏకంగా 11 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

హారర్-బోల్డ్-కామెడీ

శ్రావణ శుక్రవారం స్పెషల్‌గా రిలీజైన సినిమాలు, వెబ్ సిరీసుల్లో హారర్, బోల్డ్, సూపర్ హీరో జోనర్ సినిమాలతో పాటు ఓ కామెడీ వెబ్ సిరీస్ కూడా స్పెషల్ కానుంది. మరి ఈ సినిమాలు, వెబ్ సిరీసులు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

నెట్‌‌ఫ్లిక్స్ ఓటీటీ

కెంగన్ అసుర సీజన్ 2 పార్ట్ 2 (యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16

ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ (హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 16

పెరల్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- ఆగస్ట్ 16

లవ్ నెక్ట్స్ డోర్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 17

షాజమ్: ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ (ఇంగ్లీష్ సూపర్ హీరో చిత్రం)- ఆగస్ట్ 17

ది గార్‌ఫీల్డ్ మూవీ (యానిమేషన్ సినిమా)- ఆగస్ట్ 17

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

వాస్కోడిగామా (తమిళ సినిమా)- ఆగస్ట్ 16

యే మేరి ఫ్యామిలీ సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16

ఆహా ఓటీటీ

ఎవోల్ (తెలుగు బోల్డ్ మూవీ)- ఆగస్ట్ 16

కొంజల్ పెసినాల్ ఎన్న (తమిళ సినిమా)- ఆగస్ట్ 16

మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్ట్ 16

బెల్ ఎయిర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జియో సినిమా ఓటీటీ- ఆగస్ట్ 16

చమక్: ది కంక్లూజన్ (హిందీ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్ట్ 16

డిస్పకబుల్ మీ 4 (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో ఓటీటీ- ఆగస్ట్ 16

11 ఓటీటీ స్ట్రీమింగ్

ఇలా ఇవాళ సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 11 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో పెరల్ అనే హాలీవుడ్ హారర్ మూవీ, సూపర్ హీరో చిత్రం షాజమ్‌కు సీక్వెల్‌గా వచ్చిన షాజమ్: ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. అలాగే తెలుగు బోల్డ్ రొమాంటిక్ మూవీ ఎవోల్ మరింత స్పెషల్ కానుంది.

నాలుగు స్పెషల్

వీటితోపాటు సత్యరాజ్ నటించిన మై పర్‌ఫెక్ట్ హస్బండ్ అనే వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ అవనుంది. ఇలా ఇవాళ విడుదలైన పదకొండింటిలో నాలుగు స్పెషల్ కానున్నాయి. వాటిలో మూడు సినిమాలు ఉండగా.. ఒకటి వెబ్ సిరీస్ ఉంది.