Kalki 2898 AD Box Office: దుమ్ములేపుతున్న కల్కి 2898 ఏడీ కలెక్షన్స్- ఒక్కరోజే కోటికిపైగా వసూళ్లు- మరి లాభాలు ఎంతంటే?
Kalki 2898 AD 45 Days Worldwide Collection: నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ 45వ రోజు భారీ వసూళ్లను కొల్లగొట్టింది. మొన్నిటివరకు రోజువారీగా లక్షల్లో కలెక్షన్స్ రాగా 45వ రోజు అయిన శనివారం నాడు కోటికిపైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది.
Kalki 2898 AD Box Office Collection: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ క్రేజీ మూవీ కల్కి 2898 ఏడీ. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్‌గాథియేటర్లలో రిలీజై ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లతో దుమ్ములేపుతోంది.
మొన్నటివరకు రోజు వారీగా లక్షల్లో కలెక్షన్స్ సాధించిన కల్కి 2898 ఏడీ సినిమా 45వ రోజు అయిన ఏడో శనివారం అంటే ఆగస్ట్ 11న ఏకంగా కోటికిపైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ప్రభాస్ క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ వేదికగా నిరూపితమైంది. కల్కి మూవీకి 45వ రోజున ఒక్క ఇండియాలో రూ. 1.14 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో గత రోజులతో పోల్చుకుంటే 75.38 శాతం వసూళ్లు పెరిగాయి.
ఈ కోటి 14 లక్షల కలెక్షన్లలో తెలుగు నుంచి 25 లక్షలు, తమిళం నుంచి 2 లక్షలు, హిందీ నుంచి ఏకంగా 85 లక్షలు, కన్నడ, మలయాళం నుంచి చెరో లక్ష మాత్రమే వసూలు అయ్యాయి. కల్కి మూవీకి రోజు వారి కలెక్షన్లలో తెలుగు కంటే హిందీ నుంచే ఎక్కువగా వస్తున్నాయి. అలాగే మొత్తం ప్రదర్శించిన రోజులను లెక్క వేసిన కూడా హిందీ వెర్షన్ కలెక్షన్సే అధికంగా ఉన్నాయి.
కల్కి 2898 ఏడీ మూవీకి ఇండియాలో 45 రోజుల్లో రూ. 643.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. వీటిలో తెలుగులో నుంచి రూ. 286.06 కోట్ల నికర వసూళ్లు ఉంటే.. హిందీ బెల్ట్ నుంచి రూ. 291.2 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కన్నడ నుంచి 5.87 కోట్లు, తమిళం నుంచి 36.05 కోట్లు, మలయాళం నుంచి 24.17 కోట్లుగా కల్కి వసూళ్లు ఉన్నాయి.
45 డేస్‌లో కల్కి 2898 ఏడీ సినిమాకు రూ. 763.75 కోట్ల డొమెస్టిక్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 274.50 కోట్లు కొల్లగొట్టింది కల్కి 2898 ఏడీ మూవీ. ఇవన్నీ కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ. 1057.90 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కల్కి 2898 ఏడీకి 45వ రోజున 21.40 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.
కల్కి 2898 ఏడీ లాభాల విషయానికొస్తే.. మూవీకి రూ. 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. రూ. 372 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ లక్ష్యాన్నీ ఎప్పుడో దాటేసిన కల్కి 2898 ఏడీ మూవీ ఈ 45 రోజుల్లో రూ. 165.75 కోట్ల ప్రాఫిట్ రాబట్టగలిగింది. అంటే వైజయంతీ నిర్మాణ సంస్థకు ఈ లాభం చేరనుందని తెలుస్తోంది.
వరల్డ్ వైడ్‌గా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన కల్కి 2898 ఏడీ సినిమాకు 46వ రోజు అయిన ఆదివారం (ఆగస్ట్ 11) రూ. 94 లక్షల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, నైట్ షో కంప్లీట్ అయ్యే సరికి కోటికిపైగా వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.