OTT Horror Movie: ఓటీటీలోకి బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ హారర్ మూవీ.. ఆ ట్విస్ట్ ఉండనుందా?-shraddha kapoor comedy horror movie stree 2 to stream on amazon prime video ott platform on rental basis ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Movie: ఓటీటీలోకి బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ హారర్ మూవీ.. ఆ ట్విస్ట్ ఉండనుందా?

OTT Horror Movie: ఓటీటీలోకి బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ హారర్ మూవీ.. ఆ ట్విస్ట్ ఉండనుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 21, 2024 04:33 PM IST

Stree 2 OTT Release: బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతున్న ‘స్త్రీ 2’ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ కామెడీ హారర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్‍పై సమాచారం వెల్లడైంది. అయితే, ముందుగా ఓ ట్విస్టుతో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

OTT Horror Movie: ఓటీటీలోకి బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ హారర్ మూవీ.. ఆ ట్విస్ట్ ఉండనుందా?
OTT Horror Movie: ఓటీటీలోకి బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ హారర్ మూవీ.. ఆ ట్విస్ట్ ఉండనుందా?

‘స్త్రీ 2’ చిత్రం అందరి అంచనాలను మించి అత్యంత భారీ హిట్ అయింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్స్ చేసిన ఈ కామెడీ హారర్ చిత్రం రికార్డులను బద్దలుకొట్టింది. భారత్‍లో గ్రాస్ కలెక్షన్ల విషయంలో జవాన్‍ను కూడా దాటేసి హిందీ చిత్రాల్లో టాప్‍కు చేరింది. 2018 హిట్ అయిన స్త్రీకి సీక్వెల్‍గా ఈ మూవీ వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజైన ‘స్త్రీ 2’ పాజిటివ్ టాక్‍తో ఆరంభం నుంచి భారీ కలెక్షన్లను సాధిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.

ఎప్పుడు.. ఏ ఓటీటీలో?

స్త్రీ 2 చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కైవసం చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు ప్లాన్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో సమాచారం చక్కర్లు కొడుతోంది. అయితే, స్ట్రీమింగ్ విషయంలో ఓ మెలిక ఉండనుంది టాక్.

ట్విస్ట్ ఇదే!

స్త్రీ 2 చిత్రాన్ని ముందుగా రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారట. అందుకే రెంట్ చెల్లిస్తేనే చూసేలా ఈ మూవీ ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఇంకా థియేట్రికల్ రన్ సాగుతోంది. క్రేజ్ విపరీతంగా ఉంది. దీంతో సెప్టెంబర్ 27న రెంటల్ విధానంలో స్త్రీ 2 సినిమాను స్ట్రీమింగ్‍కు తేవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే, అక్టోబర్ రెండో వారం నుంచి ప్రైమ్ వీడియోలో ‘స్త్రీ 2’ మూవీకి రెంట్ తొలగిపోతుందని తెలుస్తోంది. అప్పటి నుంచి సబ్‍స్క్రైబర్లందరూ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మరి సెప్టెంబర్ 27న రెంటల్ విధానంలో స్త్రీ 2 మూవీ ప్రైమ్ వీడియోలోకి వస్తుందేమో చూడాలి.

స్త్రీ 2 కలెక్షన్లు

స్త్రీ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు రూ.828 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఇండియాలోనే రూ.568.67 కోట్ల నెట్ వసూళ్లను కైవసం చేసుకుంది. రూ.60కోట్ల బడ్జెట్‍తోనే రూపొందిన ఈ చిత్రం చాలా రికార్డులను బద్దలుకొట్టింది. ఇంకా థియేట్రికల్ రన్ సాగుతోంది.

స్త్రీ 2 మూవీకి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్‍తో పాటు పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానా, అతుల్ శ్రీవాత్సవ, ముస్తాక్ ఖాన్, సునీత్ రాజ్వార్, అన్య సింగ్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సచిన్ - జిగర్, జస్టిన్ వర్గీస్ మ్యూజిక్ ఇచ్చారు.

స్త్రీ 2 చిత్రాన్ని మాడ్‍డాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై దినేశ్ విజన్, జ్యోతి దేశ్‍పాండే ప్రొడ్యూజ్ చేశారు. ఈ సీక్వెల్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ అవటంతో మేకర్లకు లాభాల వర్షం కురిసింది. డైరెక్టర్ అమర్ కౌశిక్.. స్త్రీ 2లో గ్రిప్పింగ్ నరేశన్‍తో పాటు కామెడీ, హారర్ ఎలిమెంట్లతో మెప్పించారు. దీంతో ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. స్త్రీ 3 కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసేశారు.