Bollywood Box Office: మూడు సినిమాల బాక్సాఫీస్ వార్.. శ్రద్ధా కపూర్ చిత్రానికి హిట్ టాక్.. ఆధిపత్యం ఆ మూవీదేనా?-stree 2 vs khel khel mein vs vedaa shraddha kapoor horror comedy movie gets positive talk set to dominate ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bollywood Box Office: మూడు సినిమాల బాక్సాఫీస్ వార్.. శ్రద్ధా కపూర్ చిత్రానికి హిట్ టాక్.. ఆధిపత్యం ఆ మూవీదేనా?

Bollywood Box Office: మూడు సినిమాల బాక్సాఫీస్ వార్.. శ్రద్ధా కపూర్ చిత్రానికి హిట్ టాక్.. ఆధిపత్యం ఆ మూవీదేనా?

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 15, 2024 04:34 PM IST

Bollywood: బాలీవుడ్‍లో నేడు మూడు సినిమాలు బాక్సాఫీస్ క్లాష్‍కు దిగాయి. స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేద చిత్రాలు విడుదలయ్యాయి. హారర్ కామెడీ సీక్వెల్‍గా వచ్చిన స్త్రీ 2 సినిమా అడ్వాన్డ్స్ బుకింగ్‍ల్లో అదరగొట్టడంతో పాటు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇండిపెండెన్స్ డే పోటీలో ఈ మూవీ డామినేట్ చేస్తోంది.

Bollywood Box Office: మూడు సినిమాల బాక్సాఫీస్ వార్.. శ్రద్ధ కపూర్ చిత్రానికి హిట్ టాక్.. ఆధిపత్యం ఆ మూవీదేనా?
Bollywood Box Office: మూడు సినిమాల బాక్సాఫీస్ వార్.. శ్రద్ధ కపూర్ చిత్రానికి హిట్ టాక్.. ఆధిపత్యం ఆ మూవీదేనా?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాలీవుడ్‍లో నేడు ఏకంగా మూడు సినిమా విడుదలయ్యాయి. ఈ వీక్‍లో సెలవులు కూడా ఎక్కువగా ఉండటంతో వెనక్కి తగ్గకుండా బాక్సాఫీస్ క్లాష్‍కు దిగాయి. ‘స్త్రీ 2’, ‘ఖేల్ ఖేల్ మే’, ‘వేద’ చిత్రాలు నేడు (ఆగస్టు 15) రిలీజ్ అయ్యాయి. హైప్ ఉన్న ఈ సినిమాలు పోటీపడటంతో ఏది విన్నర్‌గా నిలుస్తుందనే క్యూరియాసిటీ అధికంగా ఉంది. అయితే, టాక్, ట్రెండ్‍ను బట్టి చూస్తే స్త్రీ 2 ఆధిపత్యం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇవే..

‘స్త్రీ 2’కు హిట్ టాక్.. భారీగా బుకింగ్స్

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలు పోషించిన స్త్రీ 2 చిత్రం భారీ హైప్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2018లో తక్కువ బడ్జెట్‍తో వచ్చి రూ.180 కోట్ల కలెక్షన్లతో సెన్సేషనల్ హిట్ అయిన హారర్ కామెడీ ‘స్త్రీ’ మూవీకి ఆరేళ్ల తర్వాత సీక్వెల్‍గా వచ్చింది. దీంతో స్త్రీ 2పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. గురువారమే (ఆగస్టు 14) ఈ మూవీ ప్రీమియర్లు పడగా.. నేడు (ఆగస్టు 15) పూర్తిస్థాయిలో రిలీజ్ అయింది.

స్త్రీ 2 మూవీ ప్రీమియర్లతో పాటు తొలి రోజు కూడా భారీగా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇప్పటికే చాలా హైప్ ఉండగా.. ఈ మూవీకి పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. మరోసారి కామెడీ అద్భుతంగా పండిందని, హారర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయని, శ్రద్ధా, రాజ్‍కుమార్ రావ్ పర్ఫార్మెన్స్ మెప్పించిందంటూ రెస్పాన్స్ వస్తోంది. దీంతో స్త్రీ 2 చిత్రానికి వీకెండ్ బుకింగ్స్ జోరు కూడా పెరిగింది. స్త్రీ 2 చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు.

ఖేల్ ఖేల్ మే

ఇటీవల వరుస ప్లాఫ్‍లను ఎదుర్కొన్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ఖేల్ ఖేల్ మే చిత్రం రూపొందింది. ఈ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ కామెడీ డ్రామా మూవీలో ఫర్దీన్ అక్తర్, తాప్సీ పన్ను, వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్ కీలకపాత్రలు పోషించారు. ముదాసర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే, కామెడీ ఆకట్టుకుంటోందని ఈ మూవీని చూసిన నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ చిత్రం కూడా మంచి రన్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

వేదా

జాన్ అబ్రహాం హీరోగా వేదా సినిమా వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి అంశంతో ఈ చిత్రం వచ్చింది. దేశంలోని కులవ్యవస్థ, సమస్యలు, సవాళ్ల గురించి ఈ మూవీ వచ్చింది. ఈ చిత్రంలో సందేశం బాగున్నా.. సాగదీతగా ఉందంటూ మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ చిత్రానికి బుకింగ్స్ కూడా అంచనాలకు తగ్గట్టుగా లేవు. బాక్సాఫీస్ వద్ద వేదా మూవీ పుంజుకోగలదేమో చూడాలి. వేద చిత్రానికి నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించారు. జాన్ అబ్రహాంతో పాటు శార్వరి వాఘ్, అభిషేక్ బెనర్జీ, తమన్నా భాటియా లీడ్ రోల్స్ చేశారు.

తొలి రోజు ఎంత రావొచ్చు! ‘స్త్రీ 2’దే ఆధిపత్యం

మొత్తంగా ఈ ఇండిపెండెన్స్ డే రోజున రిలీజైన మూడు సినిమాల్లో ప్రస్తుతం ‘స్త్రీ 2’ సినిమా పూర్తిగా డామినేట్ చేస్తోంది. పెయిడ్ ప్రివ్యూలతోనే ఈ చిత్రం రూ.7.5 కోట్లను దక్కించుకుంది. ఈ చిత్రం ఫస్ట్ డే రూ.40కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. వీకెండ్‍లో మరింత జోరు పెరిగేలా కనిపిస్తోంది. ఖేల్ ఖేల్ మే, వేదా చిత్రాలకు ఫస్ట్ డే రూ.10కోట్లలోపే వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

షారుఖ్ రికార్డు బ్రేక్

పెయిడ్ ప్రీవ్యూల కలెక్షన్లలో షారుఖ్ ఖాన్ చెన్నె ఎక్స్‌ప్రెస్ రికార్డును ‘స్త్రీ 2’ బద్దలుకొట్టింది. ప్రివ్యూల నుంచి చెన్నె ఎక్స్‌ప్రెస్ రూ.6.75 కోట్లు సాధిస్తే.. ఇప్పుడు స్త్రీ 2 రూ.7.5 కోట్లను దక్కించుకొని ఈ మూవీని అధిగమించింది. దీంతో 11 ఏళ్ల ప్రివ్యూ కలెక్షన్ల రికార్డును శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ బద్దలుకొట్టేసింది.