(1 / 6)
OTT Release This Friday: ఈ శుక్రవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్లలో టాప్ 5 వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
(2 / 6)
మిథ్యా 2 ఓటీటీ: సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిథ్యా సీజన్ 2 ఈ శుక్రవారం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్లో హ్యూమా ఖురేషి, అవంతిక దస్సాని, పరంబ్రతా ఛటర్జీ నటించారు. ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
(3 / 6)
బార్బీ మిస్టరీస్: ది గ్రేట్ హార్స్ ఛేజ్ ఓటీటీ; నవంబర్ 1 అంటే ఇవాళ్టీ నుంచి బార్సీ మిస్టరీస్: ది గ్రేట్ హార్స్ చేజ్ యానిమేటెడ్ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే యాక్షన్ అడ్వెంచర్ సిరీస్ను నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు.
(4 / 6)
కిష్కింద కాండం ఓటీటీ స్ట్రీమింగ్: మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం కిష్కింద కాండం నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉన్న ఈ చిత్రానికి దింజిత్ అయ్యన్ దర్శకత్వం వహించారు. ఆసిఫ్ అలీ, విజయరాఘవన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించారు.
(5 / 6)
లబ్బర్ పాండు ఓటీటీ: తమిళ స్పోర్ట్స్ డ్రామా ‘లబ్బర్ పాండు’ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. హరీష్ కళ్యాణ్, అట్టకత్తి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగులోో కూడా చూడవచ్చు.
(6 / 6)
ది డిప్లోమాట్ సీజన్ 2 ఓటీటీ: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది డిప్లోమాట్ సీజన్ 2 నెట్ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో కెర్రీ రస్సెల్, రుఫస్ సెవెల్, డేవిడ్ గాస్సీ కీలక పాత్రల్లో నటించారు.
ఇతర గ్యాలరీలు