OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్ అన్ని జోనర్లలో- ఎక్కడంటే?-ott telugu movies this week on netflix aha amazon prime indian 2 ott release birthmark ott streaming ott movies ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్ అన్ని జోనర్లలో- ఎక్కడంటే?

OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్ అన్ని జోనర్లలో- ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 11, 2024 06:12 PM IST

OTT Telugu Movies This Week: ఓటీటీలోకి ఈ వారం తెలుగు భాషలో ఏకంగా 12 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో 11 సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉంది. తెలుగులో డబ్ అయిన ఈ వివిధ భాషా చిత్రాలు రెండు వారాల పాటు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో చూద్దాం.

ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్ అన్ని జోనర్లలో- ఎక్కడంటే?
ఈ వారం ఓటీటీలో 12 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్- హారర్ టు క్రైమ్ థ్రిల్లర్ అన్ని జోనర్లలో- ఎక్కడంటే?

OTT Telugu Movies: ఓటీటీలో తెలుగు సినిమాలు మాత్రమే కాదు ఇతర భాషా చిత్రాలు సైతం సందడి చేస్తుంటాయి. మూవీ లవర్స్ ఏ భాషలో ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చిన సబ్‌టైటిల్స్‌తో అయిన చూస్తారు. కానీ, కొంతమంది మాత్రం వాటిని తెలుగులోనే చూడాలని అనుకుంటారు. అలాంటి వారికోసమే ఈ వారంలో ఓటీటీలోకి వచ్చిన 20కిపైగా సినిమాల్లో ఏకంగా 12 తెలుగు భాషలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

11 సినిమాలు, ఒక వెబ్ సిరీస్ కలిపి ఓటీటీలో 12 స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారంలో పలు తేదిల్లో ఓటీటీ రిలీజైన ఈ సినిమాలు చాలా వరకు స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి. మరి ఇవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎన్ని భాషల్లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయో తెలుసుకుందాం.

ది బర్త్ డే బాయ్ ఓటీటీ

ఇటీవల తెలుగులో విడుదలైన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ది బర్త్‌డే బాయ్ ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఆహా ఓటీటీలో కేవలం తెలుగు భాషలోనే ది బర్త్ డే బాయ్ సినిమా ఆగస్ట్ 9 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

ఇండియన్ 2 ఓటీటీ

కమల్ హాసన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచిన ఇండియన్ 2 సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఆగస్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తొలి రోజు నుంచే టాప్ 2 ట్రెండింగ్‌లో నిలిచిన ఈ భారతీయుడు 2 మూవీ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది.

ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా ఓటీటీ

తెలుగు హీరోయిన్ తాప్సీ నటించిన బోల్డ్ రొమాంటిక్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా. ఆగస్ట్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ మూవీ అందులో టాప్ 1 ప్లేసులో ట్రెండ్ అవుతోంది. ఇది హిందీతోపాటు తెలుగు, ఇంగ్లీష్, తమిళం, స్పానిష్, బ్రెజిలయన్ భాషల్లో అందుబాటులో ఉంది.

చందు ఛాంపియన్ ఓటీటీ

స్పోర్ట్స్ అండ్ బయోపిక్ మూవీగా వచ్చిన కార్తీక్ ఆర్యన్ మూవీ చందూ ఛాంపియన్ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది హిందీతోపాటు తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులో ఉంది. మోటివేషన్ పెంచే ఈ సినిమా ఒక బెస్ట్ ఆప్షన్.

లిటిల్ మిస్ రాథర్ ఓటీటీ

లిటిల్ మిస్ రాథర్ మూవీ మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీ. విష్ణు దేవ్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

బర్త్‌మార్క్ ఓటీటీ

ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న తమిళ థ్రిల్లర్ సినిమా బర్త్‌మార్క్. ఆగస్ట్ 9 నుంచి ఆహాలో డిజిటల్ ప్రీమియర్ అవుతోన్న ఈ సినిమా కేవలం తెలుగులోనే అందుబాటులో ఉంది.

డెరిక్ అబ్రహాం ఓటీటీ

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డెరిక్ అబ్రహం ఆగస్ట్ 10 నుంచి ఆహా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలో సక్సెస్ అయిన ఈ సినిమా ఆహాలో కేవలం తెలుగు భాషలోనే ఉంది.

టర్బో ఓటీటీ

మమ్ముట్టి నటించిన మరో సినిమా టర్బో సోనీ లివ్ ఓటీటీలో ఆగస్ట్ 9న రిలీజైంది. సోనీ లివ్‌లో టర్బో చిత్రం మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

లైఫ్ హిల్ గయి ఓటీటీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చిన హిందీ కామెడీ రొమాంటిక్ వెబ్ సిరీస్ లైఫ్ హిల్ గయి. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ నటించిన ఈ సిరీస్ హిందీతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, ఇంగ్లీషులో అందుబాటులో ఉంది.

గుడ్‌ఛడీ ఓటీటీ

రొమాంటిక్ కామెడీ మూవీ గుడ్‌ఛడీ జియో సినిమా ఓటీటీలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సంజయ్ దత్, రవీనా టాండన్ నటించడం విశేషం.

లిసా ఫ్రాంకెన్‌స్టైన్ ఓటీటీ

హారర్ అండ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ లిసా ఫ్రాంకెన్‌స్టైన్. జియో సినిమాలో లిసా ఫ్రాంకెన్‌స్టైన్ ఇంగ్లీషుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

డీ బ్లాక్ ఓటీటీ

రెండేళ్ల క్రితం తమిళంలో మంచి హిట్ అందుకున్న హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటైన డీ బ్లాక్ తెలుగులోకి వచ్చేసింది. ఈటీవీ విన్ ఓటీటీలో డీ బ్లాక్ సినిమా తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.