OTT Spy Thriller: ఏడేళ్లకు మరో ఓటీటీలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్- తొలిరోజే ట్రెండింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?-kingsman the golden circle ott release on netflix ott spy action thriller kingsman 2 ott streaming ott movies ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Spy Thriller: ఏడేళ్లకు మరో ఓటీటీలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్- తొలిరోజే ట్రెండింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Spy Thriller: ఏడేళ్లకు మరో ఓటీటీలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్- తొలిరోజే ట్రెండింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 11, 2024 07:30 AM IST

Kingsman The Golden Circle OTT Streaming: బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ కింగ్స్‌మన్ ది గోల్డెన్ సర్కిల్ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ రిలీజ్ అయిన తొలిరోజు నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న కింగ్స్‌మన్ 2 సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకుందాం.

ఏడేళ్లకు మరో ఓటీటీలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్- తొలిరోజే ట్రెండింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏడేళ్లకు మరో ఓటీటీలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్- తొలిరోజే ట్రెండింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Kingsman The Golden Circle OTT Release: యాక్షన్ సినిమాలు, పక్కా కమర్షియల్ మూవీస్ ఎప్పుడు దర్శనం ఇస్తూనే ఉంటాయి. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ రావడం మాత్రం చాలా అరుదుగా జరుగతుంటాయి. కానీ, ఓటీటీల హవా పెరిగాక అన్ని రకాల జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు కుప్పలు తెప్పలుగా వస్తూ అలరిస్తున్నాయి.

క్రైమ్, సస్పెన్స్, కామెడీ, రొమాంటిక్, హారర్ ఇలాంటి జోనర్స్‌లో సినిమాలు ఎక్కువగా వచ్చినప్పటికీ స్పై తరహా చిత్రాలు రావడానికి మాత్రం చాలా గ్యాప్ ఉంటుంది. ఇక స్పై సినిమాలు అంటే ఇంతకుముందు జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ వంటి బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీసే గుర్తుకు వచ్చేవి. అయితే, ఈ స్పై యాక్షన్ తరహా సినిమాలకు కాస్తా కామెడీ యాడ్ చేసి తెరకెక్కిన సిరీస్ కింగ్స్‌మన్ ఫ్రాంఛైజీ.

హాలీవుడ్‌లో మరో స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీగా పేరు తెచ్చుకున్న కింగ్స్‌మన్ ఆడియెన్స్‌ను బాగానే అలరిస్తోంది. ఈ మూవీ సిరీస్‌లో ఇప్పటికీ మూడు సినిమాలు వచ్చాయి. మొదట 2014లో "కింగ్స్‌మన్: ది సీక్రెట్ సర్వీస్" టైటిల్‌తో వచ్చి మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత మూడేళ్లకు 2017లో "కింగ్స్‌మన్: ది గోల్డెన్ సర్కిల్" మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఇక మూడో సినిమా నాలుగేళ్లకు 2021లో ది కింగ్స్‌మన్ టైటిల్‌తో వచ్చింది. జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమాల్లో కూడా డిఫరెంట్ వెపన్స్, ఎన్నో సౌకర్యాలు ఉండే కారులు, ఊహించని విధంగా పేలే గన్స్, అంబ్రెల్లా గన్స్ ఉంటాయి. యాక్షన్ సీన్స్‌లో ఇవి వచ్చినప్పుడు ప్రేక్షకులకు అదిరిపోయే థ్రిల్ వస్తుంది.

ఈ సిరీస్‌ను మార్క్ మిల్లర్, డేవ్ గిబ్బన్స్ రచించిన మిల్లర్ వరల్డ్ కామిక్ బుక్ సిరీస్ ది సీక్రెట్ సర్వీస్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ ది సీక్రెట్ సర్వీస్ అనే బుక్ టైటిల్‌ను తర్వాత కింగ్స్‌మన్‌గా మార్చారు. అయితే, ప్రస్తుతం ఈ మూడు సినిమాల్లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్ భాషలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొదటి మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే, ఇప్పుడు వీటిలో మరో ఓటీటీలోకి వచ్చేసిన సినిమా "కింగ్స్‌మన్: ది గోల్డెన్ సర్కిల్". మాథ్యూ వాఘ్ దర్శకత్వం వహించిన కింగ్స్‌మన్ 2 మూవీ సుమారు ఏడేళ్లకు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఆగస్ట్ 9న ఓటీటీ రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజు నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. టాప్ 8వ స్థానంలో నెట్‌ఫ్లిక్స్‌లో కింగ్స్‌మన్ 2 ట్రెండింగ్‌ అవుతూ దూసుకుపోతోంది.

అయితే, ప్రస్తుతం మాత్రం "కింగ్స్‌మన్: ది గోల్డెన్ సర్కిల్" మూవీ టాప్ 10 ప్లేసులో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. కామెడీతో స్పై యాక్షన్ సినిమాలను మెచ్చేవారికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. కాగా ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ రేటింగ్ పదికి 6.7 వచ్చింది. 10.4 కోట్ల యూఎస్ డాలర్లతో తెరకెక్కిన కింగ్స్‌మన్ 2 బాక్సాఫీస్ వద్ద 41.09 కోట్ల యూఎస్ డాలర్స్ కొల్లగొట్టడం విశేషం.