OTT Thriller: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- చాక్లెట్‌ చూస్తే చంపేసే హీరో- సూపర్ ట్విస్టులు- స్ట్రీమింగ్ ఎక్కడంటే?-ott psychological crime thriller movie aneethi on amazon prime ott blood and chocolate ott streaming telugu aneethi ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- చాక్లెట్‌ చూస్తే చంపేసే హీరో- సూపర్ ట్విస్టులు- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Thriller: ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- చాక్లెట్‌ చూస్తే చంపేసే హీరో- సూపర్ ట్విస్టులు- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Aug 07, 2024 01:37 PM IST

OTT Psychological Crime Thriller Movie Blood And Chocolate: ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఆకట్టుకుంటోంది. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన తమిళ సినిమా అనీతి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. బ్లడ్ అండ్ చాక్లెట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎక్కడనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- చాక్లెట్‌ చూస్తే చంపేసే హీరో- సూపర్ ట్విస్టులు- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్- చాక్లెట్‌ చూస్తే చంపేసే హీరో- సూపర్ ట్విస్టులు- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aneethi OTT Streaming In Telugu: డిఫరెంట్ కంటెంట్‌తో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తుంటాయి. అలాగే అలాంటి విభిన్న కథా చిత్రాలపై ఆడియెన్స్ ఎక్కువ మక్కువ చూపిస్తారు. చాలావరకు ప్రేక్షకులు ఇష్టపడే జోనర్ హారర్ అయినప్పటికీ మర్డర్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి.

ఇంట్రెస్టింగ్‌గా ఇన్వెస్టిగేషన్

వరుస హత్యలు, వాటిని ఛేదించే ప్రాసెస్, చివరి వరకు హంతకుడు ఎవరనేది సస్పెన్స్‌గా ఉండటం వంటి విషయాలను ఎంత థ్రిల్లింగ్‌గా తెరకెక్కిస్తే అంతగా అట్రాక్ట్ చేస్తాయి. ఇక ఈ మర్డర్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్స్‌కు సైకలాజికల్ జోనర్ తోడు అయితే మరింత ఇంట్రెస్టింగ్‌గా సినిమా అనిపిస్తోంది. అలాంటి ఓ తమిళ సినిమానే ఇప్పుడు ఓటీటీలో అందరిదృష్టిని అట్రాక్ట్ చేస్తోంది.

సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా

సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఒక్కోటి ఒక్కోరంగా ఉంటాయి. సైకోలా మర్డర్స్ చేయడం, లేదా ఇమాజినేషన్ చేసుకోవడం వంటి పలు విధాలుగా సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఇలాంటి తమిళ సినిమానే అనీతి. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అనీతి ప్రస్తుతం ఓటీటీలో మంచి రెస్పాన్స్‌తో ఆకట్టుకుంటోంది.

5 కోట్ల బడ్జెట్‌

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అనీతి మూవీ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా ఈ సినిమాను తెలుగులో బ్లడ్ అండ్ చాక్లెట్ టైటిల్‌తో విడుదల చేశారు. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన అనీతి సినిమా 2023 జూలై 21న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

చాక్లెట్‌ను చూస్తే చాలు

పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమా కథ విషయానికొస్తే.. తిరు అనే ఫుడ్ డెలీవరీ బాయ్ చుట్టూ తిరుగుతుంటుంది. ఫుడ్ డెలీవరి చేసిన ప్రతి కస్టమర్‌ను తిరు కొడుతుంటాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. అప్పటివరకు బాగా ఉండే తిరు చాక్లెట్‌ను చూస్తే చాలు సైకోలా మారిపోతుంటాడు.

తిరు గతం ఏంటీ?

చాక్లెట్ చూసి తిరు ఎందుకు అగ్రెసివ్‌గా మారుతున్నాడు? తిరు గతం ఏంటీ? తిరు హత్యలు చేశాడా? తిరు ప్రేమించిన అమ్మాయి ఇంటి ఓనర్ ఎలా చనిపోయింది? అనే విషయాలు తెలియాలంటే ఈ అనీతి తెలుగులో బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమా చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో తిరు పాత్రలో కోలీవుడ్ పాపులర్ యాక్టర్ అర్జున్ దాస్ నటించాడు.

డైరెక్టర్ శంకర్ సమర్పకుడిగా

వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ అనీతి సినిమాలో అర్జున్ దాస్‌తోపాటు దుషారా విజయన్, సారా అర్జున్, అర్జున్ చిదంబరం, కాళీ వెంకట్, వనిత విజయ్ కుమార్, సింగంపులి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకర్ సమర్పకుడిగా వ్యవహహించారు.

6.6 ఐఎమ్‌డీబీ రేటింగ్

కాగా అనీతి సినిమాకు ఐఎమ్‌డీబీ 10కి 6.6 రేటింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే, కార్తీ ఖైదీ, విజయ్ మాస్టర్, కమల్ హాసన్ విక్రమ్ సినిమాలతో చాలా పాపులర్ అయ్యాడు అర్జున్ దాస్. ఇక తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల కల్కి 2898 ఏడీ సినిమాలో కృష్ణుడి పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పాడు అర్జున్ దాస్.