Kalki 2898 AD OTT Official: అఫీషియల్- రెండు ఓటీటీల్లో కల్కి 2898 ఏడీ రిలీజ్- ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ అంటే?
Kalki 2898 AD OTT Streaming: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ ఓటీటీపై అధికారిక ప్రకటన వచ్చేసినట్లు తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ మూవీ ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. మరి కల్కి డిజిటల్ ప్రీమియర్ డేట్ ఏంటనే వివరాల్లోకి వెళితే..
బాక్సాఫీస్ వద్ద
కల్కి మూవీలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, హిందీ అగ్ర కథానాయిక దీపికా పదుకొణెతోపాటు హాట్ బ్యూటి దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
కల్కి 2898 ఏడీ కలెక్షన్స్
రోజుకు సుమారు కోటి రూపాయల చొప్పున కలెక్షన్స్ వసూలు తెచ్చిపెడుతోంది. ఇలా ఇప్పటికీ ఐదు వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా రూ. 635.95 కోట్ల నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా రూ. 1050 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కల్కి 2898 ఏడీ ఓటీటీ
బాహుబలి తర్వాత అంతపెద్ద హిట్ అందుకున్న ప్రభాస్ సినిమా కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ కోసం డార్లింగ్ అభిమానులతోపాటు సాధారణ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికి తగినట్లే కల్కి సినిమా ఇదే ఆగస్ట్ నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కల్కి 2898 ఏడీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చేసినట్లు తెలుస్తోంది.
అమెజాన్ ప్రైమ్-నెట్‌ఫ్లిక్స్
కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ రెండింట్లో ఆగస్ట్ 23 నుంచి కల్కిని డిజిటల్ ప్రీమియర్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించినట్లు ఓ పోస్టర్ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
దక్షిణాది భాషలతోపాటు
ప్రభాస్ వారియర్స్, పీబీ కల్ట్స్ అనే ఫ్యాన్ పేజీలో కల్కి 2898 ఏడీ ఓటీటీ డేట్ పోస్టర్ దర్శనం ఇచ్చింది. దీని ప్రకారం అమెజాన్ ప్రైమ్‌లో కల్కి సినిమాను తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ చేయున్నారు. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రసారం చేయనున్నారు. ఇదే నిజమైతే మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి కల్కి సినిమా వచ్చేయనుంది.
హాలీవుడ్ మూవీకి ధీటుగా
దీని ప్రకారం చూసుకుంటే కల్కి 2898 ఏడీ సినిమా విడుదలైన 8 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కల్కి సినిమా వరల్డ్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ మూవీ ముందు ధీటుగా నిలబడి కలెక్షన్స్ రాబట్టింది.