Aha OTT: ఆహా అనిపించే 6 ఓటీటీ సినిమాలు.. హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఎక్కడ చూడాలంటే?-ott movies ott trending movies this week on aha ott releases love me ott crime thriller paarijatha parvam ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott: ఆహా అనిపించే 6 ఓటీటీ సినిమాలు.. హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఎక్కడ చూడాలంటే?

Aha OTT: ఆహా అనిపించే 6 ఓటీటీ సినిమాలు.. హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 26, 2024 12:36 PM IST

OTT Trending Movies On Aha: ఓటీటీలో ఎవ్రీ వీక్, ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయని తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా ఆహా ఓటీటీలో అనేక సినిమాలు వస్తున్నాయి. వాటిలో ఇప్పటికీ ట్రెండ్ అవుతోన్న 6 సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

ఆహా అనిపించే 6 ఓటీటీ సినిమాలు.. హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఎక్కడ చూడాలంటే?
ఆహా అనిపించే 6 ఓటీటీ సినిమాలు.. హారర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఎక్కడ చూడాలంటే?

OTT Movies In Aha: దేశవ్యాప్తంగా ఎన్నో రకాల ఓటీటీ వేదికలు ఉన్నాయి. వాటిలో కేవలం తెలుగులో ఉన్న డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ చాలా తక్కువ. ఏపీ తెలంగాణలో ఎక్కువగా వినియోగించే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ఆహా ఒకటి. ఇందులో ప్రతివారం సరికొత్త సినిమాలు రిలీజ్ అవుతూ అలరిస్తుంటాయి. అయితే వాటిలో గత కొంతకాలంగా ట్రెండింగ్‌లో ఉంటున్న 6 సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

లవ్ మీ ఓటీటీ

హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా లవ్ మీ. ఇఫ్ యూ డేర్ అనేది క్యాప్షన్. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అనంతరం అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 14న ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆ తర్వాత మూడు రోజులకు అంటే జూన్ 17 నుంచి ఆహా ఓటీటీలో లవ్ మీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రిలీజ్ డే నుంచి ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్న ఈ సినిమా టాప్ 4 స్థానంలో నిలిచింది.

పారిజాత పర్వం ఓటీటీ

తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమాగా వచ్చింది పారిజాత పర్వం. చైతన్య రావు, శ్రద్ధా దాస్, సునీల్, మాళవిక సతీషన్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ కిడ్నాప్ కామెడీ డ్రామా మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ డే నుంచి ట్రెండ్ అవుతూ టాప్ 6 ప్లేసు దక్కించుకుంది.

ప్రసన్నవదనం ఓటీటీ

హీరో సుహాస్ నటించిన మరో ప్రయోగాత్మక సినిమానే ప్రసన్నవదనం. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఆహా ఓటీటీలో మే 24 నుంచి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్సుగా యాక్ట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం టాప్ 7 స్థానం దక్కించుకుంది.

గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటీటీ

బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి సినీ కెరీర్‌లో 50వ మూవీగా వచ్చింది గీతాంజలి మళ్లీ వచ్చింది. గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ ప్రస్తుతం ఆహా ఓటీటీలో టాప్ 8 ప్లేసులో ట్రెండ్ అవుతోంది. శివ తూర్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్య, శ్రీనివాస రెడ్డి, సునీల్ కామెడీ అలరించిందని టాక్ వచ్చింది.

ప్రేమలు ఓటీటీ

మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగులో కూడా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది వీక్షించిన ఈ సినిమా ఇప్పటికీ ఆహా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. టాప్ 9వ స్థానంలో ఈ రొమాంటిక్ కామెడీ మూవీ నిలిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కి రూ. 136 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమాతో మమితా బైజు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

మై డియర్ దొంగ ఓటీటీ

నేరుగా ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన కామెడీ మూవీ మై డియర్ దొంగ. అభినవ్ గోమఠం దొంగగా అలరించిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ నుంచి ట్రెండ్ అయింది. అత్యధిక వ్యూస్‌తో హిలేరియస్ ఎంటర్టైనర్‌గా నిలిచింది. ప్రస్తుతం టాప్ 10 స్థానం సంపాదించుకుని ట్రెండ్ అవుతోంది.

WhatsApp channel