South OTT Releases: జూన్‌లో ఓటీటీలో సౌత్ సినిమాల రచ్చ- మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలను ఇక్క చూసేయండి!-upcoming south ott releases in june second half netflix amazon prime disney plus hotstar ott movies garudan ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  South Ott Releases: జూన్‌లో ఓటీటీలో సౌత్ సినిమాల రచ్చ- మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలను ఇక్క చూసేయండి!

South OTT Releases: జూన్‌లో ఓటీటీలో సౌత్ సినిమాల రచ్చ- మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలను ఇక్క చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Jun 18, 2024 01:59 PM IST

Telugu Malayalam Tamil Kannada OTT Release In June: ఈ జూన్ నెలలో మరికొన్ని రోజులు మిగిలే ఉన్నాయి. ఈ జూన్ సెకండాఫ్‌లో తెలుగుతోపాటు మలయాళ, తమిళ, కన్నడ వంటి సౌత్ సినిమాలు అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

జూన్‌లో ఓటీటీలో సౌత్ సినిమాల రచ్చ-   మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలను ఇక్క చూసేయండి!
జూన్‌లో ఓటీటీలో సౌత్ సినిమాల రచ్చ- మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలను ఇక్క చూసేయండి!

Upcoming South OTT Releases In June: ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలకు మంచి డిమాండ్ పెరిగింది. అన్ని వర్గాల నుంచి దక్షిణ భాషల సినిమాలు చూస్తున్నారు. ఒకవేళ మీరు కూడా తెలుగుతోపాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో వచ్చే సినిమాలు ఇష్టపడే వారు అయితే మీకు అదిరిపోయే న్యూస్.

yearly horoscope entry point

జూన్ నెల ద్వితియార్థంలో ఓటీటీలో విడుదలయ్యే సౌత్ సినిమాలను ఇక్కడ అందుబాటులో ఉంచాం. వీటిలో బ్లాక్ బస్టర్ హారర్ సినిమా నుంచి అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ వరకు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలన్నీ తెలుగులో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎంటో చూద్దాం.

ఆడు జీవితం ఓటీటీ

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. దీని ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. అయితే, ఆడు జీవితం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ నెలలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

అరణ్మనై 4 ఓటీటీ

తమిళంలో వంద కోట్ల వరకు కలెక్ట్ చేసిన కామెడీ హారర్ థ్రిల్లర్ అరణ్మనై 4. తెలుగులో బాక్ అనే టైటిల్‌తో విడుదల చేసిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూన్ 21 నుంచి తమిళం, తెలుగుతోపాటు ఇతర భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రాశీ ఖన్నా, తమన్నా మెయిన్ లీడ్ రోల్స్ చేశారు.

గరుడన్ ఓటీటీ

2024లో విడుదలైన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో గరుడన్ ఒకటి. వెట్రిమారన్ కథ అందించగా.. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గరుడన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

గురువాయూర్ అంబలనాడయిల్

విపిన్ దాస్ దర్శకత్వం వహించిన మలయాళ కామెడీ డ్రామా మూవీ గురువాయూర్ అంబలనాదయిల్. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, నిఖిలా విమల్, అనశ్వర రాజన్, కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 28న ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాతో మలయాళ చిత్రసీమలో యోగిబాబు ఎంట్రీ ఇచ్చారు.

గం గం గణేశా ఓటీటీ

ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గం గం గణేశా. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ చివరి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. గం గం గణేశా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రాలేదు.

ఉయిర్ తమిజుక్కు

అజయన్ బాలా, మురళీ వర్మన్ కథ అందించిన తమిళ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా ఉయిర్ తమిజుక్కు. 2021 తమిళ రాజకీయాలను చూపించిన ఈ సినిమా ఇదే జూన్ నెలలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అదమ్ భవ దర్శకత్వం వహించన ఈ సినిమాలో అమీర్ సుల్తాన్, ఇమ్మాన్ అన్నాచ్చి, చాందిని శ్రీధరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆనందరాజ్, శరవణ శక్తి, సుబ్రమణ్యం శివ, మహానది శంకర్ సహాయక పాత్రల్లో నటించారు.

టర్బో ఓటీటీ

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ టర్బో సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూన్ 28 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వీటితోపాటు ఉప్పు కప్పురంబు అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో, కడువెటెట్టి అనే చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇదే నెలలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

Whats_app_banner