OTT Movies This Week: ఈ వారం ఓటీటీలో 20 సినిమాలు స్ట్రీమింగ్.. చూడాల్సినవి 4 మాత్రమే.. ఎందుకో తెలుసా?
OTT Releases This Week: ఈవారం ఓటీటీలోకి కొత్తగా సినిమాలు వెబ్ సిరీసులు కలుపుకుని మొత్తంగా 20 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వాటిలో కామెడీ హారర్ సినిమాలతో పాటు అడ్వెంచర్ ఫాంటసీ యాక్షన్ వెబ్ సిరీస్ వరకు చాలా స్పెషల్‌గా ఉండనున్నాయి. మరి అవి ఏ ఓటీటీలో చూడాలో లుక్కేయండి.
This Week OTT Movies: ఓటీటీ వేదికలు ప్రతి వారం కొత్త పుంతలు తొక్కుతూ సరికొత్త కంటెంట్‌ను డిజిటల్ ఆడియెన్స్‌కు అందిస్తున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలై విజయ్ సేతుపతి మహారాజా సినిమా మినహా మిగతావేవి చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. దాంతో అందరి దృష్టి ఓటీటీలపై పడింది.
జూన్ 17 నుంచి 23 వరకు
ఈ వారం అంటే జూన్ 17 నుంచి 23 వరకు ఓటీటీలోకి మంచి సినీ సరుకు రానుంది. ఈ వారం వెబ్ సిరీసులు, సినిమాలు కలిపి మొత్తంగా 20 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో బ్లాక్ బస్టర్ కామెడీ హారర్ సినిమా నుంచి సూపర్ హిట్ ఫాంటసీ వరల్డ్‌కు సీక్వెల్ వెబ్ సిరీస్ వరకు స్పెషల్ కానున్నాయి. మరి ఇవి ఏ ఓటీటీలో ఏ రోజు చూడాలో ఇక్కడ లుక్కేయండి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
బాక్ (తమిళంలో అరణ్మనై 4-తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 21
బ్యాడ్ కాప్ (హిందీ వెబ్ సిరీస్)- జూన్ 21
ది బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 21
జియో సినిమా ఓటీటీ
హౌజ్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్)- జూన్ 17
బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 (హిందీ రియాలిటీ షో)- జూన్ 21
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూషన్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 18
ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ వెబ్ సిరీస్)- జూన్ 18
క్లెక్స్ అకాడమీ (పోలిష్ సినిమా)- జూన్ 19
లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ వెబ్ సిరీస్)- జూన్ 19
మహారాజ్ (హిందీ సినిమా)- జూన్ 19
అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 20
కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- జూన్ 20
గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ వెబ్ సిరీస్)- జూన్ 21
నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ చిత్రం)- జూన్ 21
ది విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ వెబ్ సిరీస్)- జూన్ 21
ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 21
రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ వెబ్ సిరీస్)- జూన్ 22
సీరగన్ (తమిళ మూవీ)- ఆహా ఓటీటీ- జూన్ 18
ఇండస్ట్రీ (హిందీ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూన్ 19
లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ చిత్రం)- బుక్ మై షో- జూన్ 21
సూపర్ హిట్ వెబ్ సిరీస్
ఇలా ఈ వారం వెబ్ సిరీసులు, సినిమాలు కలిపి ఓటీటీలోకి 20 విడుదల కానున్నాయి. వీటిలో ఇప్పటికే సూపర్ హిట్ వెబ్ సిరీస్ అయిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్‌కు రెండో సీజన్ వచ్చేసింది. జియో సినిమా ఓటీటీలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతోపాటు తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ షో చేసిన కామెడీ హారర్ సినిమా బాక్ ఈ వారమే ఓటీటీలోకి వచ్చేయనుంది. అయితే, ఈ వారం ఈ రెండు చాలా స్పెషల్ రిలీజెస్ కానున్నాయి.