1134 Movie: ప్రయోగాత్మకంగా నో బడ్జెట్‌ మూవీ 1134.. రిలీజ్ డేట్ ఫిక్స్-experimental no budget movie 1134 release on december 15 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Experimental No Budget Movie 1134 Release On December 15

1134 Movie: ప్రయోగాత్మకంగా నో బడ్జెట్‌ మూవీ 1134.. రిలీజ్ డేట్ ఫిక్స్

Sanjiv Kumar HT Telugu
Dec 09, 2023 08:30 AM IST

No Budget Movie 1134: సినీ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు, చిన్న చిత్రాలు ఎన్నో సందడి చేస్తూనే ఉంటాయి. అలాంటిది నో బడ్జెట్‌గా రూపొందిన మూవీనే 1134. ఈ 1134 విడుదల తేది ఎప్పుడు? అసలు ఏంటీ నో బడ్జెట్ అనే వివరాల్లోకి వెళితే..

1134 Movie: ప్రయోగాత్మకంగా నో బడ్జెట్‌ మూవీ 1134.. రిలీజ్ డేట్ ఫిక్స్
1134 Movie: ప్రయోగాత్మకంగా నో బడ్జెట్‌ మూవీ 1134.. రిలీజ్ డేట్ ఫిక్స్

1134 Movie Release Date: ప్రస్తుతం కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. ఇలాంటి ఓ డిఫరెంట్ ప్రయోగమే ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందించారు నూతన దర్శకుడు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి. శాన్వీ మీడియా బ్యానర్‌పై రాబోతోన్న ఈ మూవీకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుందని ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌ను చూస్తూనే అర్థం అవుతోంది. 2 నిమిషాల 28 సెకనుల నిడివితో వచ్చిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సొంతంగా తనే కథ రాసుకొని హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ శరత్ చంద్ర తడిమేటి.

తాజాగా 1134 మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 1134 మూవీని డిసెంబర్ 15న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా బ్యానర్‌‌లపై తెరకెక్కుతున్న ఈ 1134 చిత్రంలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ సంగీతం అందిస్తున్నారు.

నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. అయితే 1134 మూవీ ఒక షూస్ట్రింగ్ బడ్జెట్ మూవీ. అంటే.. చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. అసలు ఈ డబ్బుతో ఒక సినిమాను ఎంత మాత్రం తెరకెక్కించలేం అనేంత తక్కువ వ్యయంతో 1134 సినిమాను నిర్మించారు. అందుకే 1134 చిత్రాన్ని నో బడ్జెట్ మూవీగా పిలుస్తున్నారు.

IPL_Entry_Point