OTT Movies This Week: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు రిలీజ్.. కానీ, చూడాల్సింది మాత్రం ఒక్కటే! ఎక్కడంటే?-new ott release this week on netflix amazon prime hotstar aha ott movies love mouli ott release sharmaji ki beti ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు రిలీజ్.. కానీ, చూడాల్సింది మాత్రం ఒక్కటే! ఎక్కడంటే?

OTT Movies This Week: ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు రిలీజ్.. కానీ, చూడాల్సింది మాత్రం ఒక్కటే! ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Published Jun 25, 2024 08:51 AM IST

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలోకి సినిమాలు వెబ్ సిరీసులు అన్ని కలిపి చూస్తే.. మొత్తంగా 21 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో తెలుగు బోల్డ్ సినిమా నుంచి కామెడీ చిత్రాల వరకు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీసులు ఉన్నాయి. మరి వాటిలో స్పెషల్ సినిమాలు, అవి ఏ ఓటీటీలో రిలీజ్ కానున్నాయో లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు రిలీజ్.. కానీ, చూడాల్సింది మాత్రం ఒక్కటే! ఎక్కడంటే?
ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు రిలీజ్.. కానీ, చూడాల్సింది మాత్రం ఒక్కటే! ఎక్కడంటే?

This Week OTT Movies: ఇప్పుడు థియేటర్లలో కల్కి 2898 ఏడీ ఫీవర్ నడుస్తోంది. ఈ వారం మొత్తం ప్రభాస్ మానియా ఉండబోతోంది. దీంతో థియేటర్లలో కల్కి తప్పా మిగతా సినిమాలు ఏవి రిలీజ్ అయ్యేందుకు సాహసం చేయలేకపోతున్నాయి. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పైనే అందరి గురి పడింది. అది క్యాష్ చేసుకుని ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీసులను రిలీజ్ చేయనున్నారు.

ఓటీటీలో ఈ వారం అంటే జూన్ 24 నుంచి 30 వరకు బోల్డ్, కామెడీ, థ్రిల్లర్ సినిమాలతో పాటు మంచి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీసులు సందడి చేయనున్నాయి. అలా మొత్తంగా అన్ని కలిపి 21 వరకు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటీ, వాటిలో ఏవి స్పెషల్‌గా ఉండనున్నాయి.. వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటనే వివరాలు చూస్తే..

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

కౌలిట్జ్ అండ్ కౌలిట్జ్ (జర్మన్ వెబ్ సిరీస్)- జూన్ 25

వరస్ట్ రూమ్ మేట్ ఎవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 26

సుపాసెల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 27

డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ సినిమా)- జూన్ 27

ది 90స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 27

ది కార్ప్స్ వాషర్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 28

ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28

ది విర్ల్ విండ్ (కొరియన్ వెబ్ సిరీస్)- జూన్ 28

ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 25

శర్మాజీ కీ బేటీ (హిందీ చిత్రం)- జూన్ 28

సివిల్ వార్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 28

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 26

వండ్ల (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 28

ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 28

ఆహా ఓటీటీ

ఉయిర్ తమిళుక్కు (తమిళ సినిమా)- జూన్ 25

లవ్ మౌళి (తెలుగు చిత్రం)- జూన్ 27

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

ది బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూన్ 27

ఆవేశం (హిందీ డబ్బింగ్ సినిమా)- జూన్ 28

రౌతు కీ రాజ్ (హిందీ చిత్రం)- జీ5 ఓటీటీ- జూన్ 28

హిగ్యుటా (మలయాళ మూవీ)- సైనా ప్లే ఓటీటీ- జూన్ 28

హిందీ ప్రేక్షకులకు మాత్రమే

ఇలా ఈ వారం ఓటీటీలోకి వెబ్ సిరీసులు, సినిమాలు కలిపి 21 స్ట్రీమింగ్ అవనున్నాయి. ఇవాళ ఒక్కరోజు రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారంలో 21లో మూడు మాత్రమే స్పెషల్ కానున్నాయి. అవే తెలుగు బోల్డ్ మూవీ లవ్ మౌళి, హిందీ కామెడీ సినిమా శర్మాజీ కీ బేటీ, ఇదివరకే బ్లాక్ బస్టర్ అయిన ఆవేశం హిందీ వెర్షన్ మూవీ.

కేవలం ఒక్కటేఅయితే వీటిలో ఆవేశం సినిమాను చాలా వరకు ప్రేక్షకులు మలయాళం, తమిళంలో చూశారు. ఇది కేవలం హిందీ ప్రేక్షకులకు మాత్రమే. ఇక కామెడీ సినిమా శర్మాజీ కీ బేటి కూడా హిందీ భాషలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక నవదీప్ లవ్ మౌళి మాత్రమే చాలా స్పెషల్ కానుంది. మిగతావి కేవలం ఓటీటీ లవర్స్ చూడాల్సినవే. ఇవే కాకుండా నెట్‌ఫ్లిక్స్ “ఏ ఫ్యామిలీ ఎఫైర్” కాస్తా ఆసక్తిగా ఉండే సినిమా కానుంది.

Whats_app_banner