My Dear Donga OTT: ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన కామెడీ మూవీ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?-my dear donga ott streaming now on aha abhinav gomatam shalini kondepudi my dear donga ott release comedy movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  My Dear Donga Ott: ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన కామెడీ మూవీ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?

My Dear Donga OTT: ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన కామెడీ మూవీ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 19, 2024 08:16 AM IST

My Dear Donga OTT Streaming Now: ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమఠం మెయిన్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మై డియర్ దొంగ. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. ఓటీటీలోకి వచ్చి స్ట్రీమింగ్ అవుతోంది. మరి మై డియర్ దొంగ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన కామెడీ మూవీ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన కామెడీ మూవీ థ్రిల్లర్.. ఎక్కడ చూస్తారంటే?

My Dear Donga OTT Release: ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు అభినవ్ గోమఠం. కమెడియన్‌గా సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మై డియర్ దొంగ. శాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించారు.

డైరెక్టర్ నుంచి

ఈ సినిమాను శాలిని కొండెపూడి స్వీయ రచన చేసి తాను కూడా నటించారు. సినిమాకు అన్ని తానై ముందుండి నడిపించారు. డైరెక్టర్ నుంచి క్యాస్టింగ్ వరకు పర్ఫెక్ట్ గోల్‌తో సినిమాను రూపొందించారు శాలిని కొండెపూడి. అభినవ్ గోమఠం మెల్ లీడ్ చేయగా.. శాలిని కొండెపూడి ఫీమేల్ లీడ్‌లో నటించారు.

గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్

మై డియర్ దొంగ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం ఏప్రిల్ (17) హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, నవ్వు తెప్పించేలా ఉంది.

దొంగతో లవ్వా?

దొంగతో లవ్వా అని ఒక పాత్ర అంటే.. లవ్ స్టోరీలో దొంగ అని ఫీమేల్ క్యారెక్టర్ చెబుతుంది. దాంతో పోలీస్ స్టేషన్‌లో పోలీసులతో అభినవ్ గోమఠం ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా ఉంది. ఓ వాచ్‌మెన్‌కు పడుకోవడం వల్ల పక్కింట్లో దొంగతనం జరిగిందని అభినవ్ గోమఠం చెప్పడం నవ్వు తెప్పించేలా ఉంది. డిగ్లీ ఆరేళ్లు చదివాకా.. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద దొంగగా మారినట్లు అభినవ్ చెప్పాడు.

దొంగలకు మనసు ఉండదా?

ఇంటి ఓనర్ సుజాత, దొంగ సురేష్ ఫ్రెండ్స్ అవుతారు. దొంగతో ఫ్రెండ్షిప్ ఏంటీ అని ఒకరు అడిగితే.. ఏ దొంగలు మనుషులు కారా. వాళ్లకి మనసు ఉండదా. వాళ్ల మనసుకి.. అంటూ సుజాత, సురేష్ తడబడటం హాస్యంగా అనిపించింది. ఓవరాల్‌గా చూస్తుంటే మై డియర్ దొంగ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉంది. దానికి కామెడీ యాడ్ చేశారు.

లొకేషన్ పంపియ్..

ఇక ట్రైలర్ చివరిలో.. లవ్ అంటే ఎమోషన్ కాదు.. లవ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఏడున్నవ్.. ఎప్పుడొస్తవ్.. ఎవనితో ఉన్నవ్.. లొకేషన్ పంపియ్.. ఇట్లుండాలే లవ్వంటే.. అని ఓ పాత్ర చెప్పే డైలాగ్ నవ్వించేలా ఉంది. ఇలా ఆసక్తికరంగా కామెడీ టచ్‌తో మై డియర్ దొంగ ట్రైలర్ ఆకట్టుకుంది.

ఏప్రిల్ 19 నుంచి

ఇక మై డియర్ దొంగ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఏప్రిల్ 19 నుంచి అంటే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది ఈ కామెడీ మూవీ. తెలుగులో మంచి కామెడీ సినిమాను చూడాలనుకునేవారికి మై డియర్ దొంగ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఆహా ఓటీటీ సినిమాలు

ఇప్పటికే ఆహాలో అనేక తెలుగు కంటెంట్ సినిమాలు అలరిస్తున్నాయి. మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు సినిమా ఆహాలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల విడుదలైన అనన్య నాగళ్ల హారర్ మూవీ తంత్ర సైతం ఆహాలో ప్రసారం అవుతోంది. అలాగే డివోషనల్ మూవీలా రామ అయోధ్య సినిమా ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

IPL_Entry_Point