Premalu OTT: ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు.. తెలుగు వెర్షన్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?-premalu movie ott streaming telugu version on aha official announcement malayalam movie premalu ott digital premiere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Premalu Ott: ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు.. తెలుగు వెర్షన్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Premalu OTT: ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు.. తెలుగు వెర్షన్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Sanjiv Kumar HT Telugu
Apr 07, 2024 11:30 AM IST

Premalu OTT Streaming Telugu Version: ఈ మధ్య కాలంలో మలయాళంలో విడుదలై భారీ హిట్ అందుకున్న సినిమా ప్రేమలు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు.. తెలుగు వెర్షన్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు.. తెలుగు వెర్షన్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Premalu OTT Release Telugu Version: ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదలైన మలయాళ చిత్రం ప్రేమలు ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి సైతం ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. అదిరిపోయే కామెడీ, ఆకట్టుకునే లవ్ అనే అంశాలతో ప్రేమలు సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్బుతమని మెచ్చుకున్నారు.

ఏప్రిల్ 6 మరో సినిమా

ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ అందించారు. శుక్రవారం (మార్చి 8)న విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. మలయాళంలో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్‌తోనే ఏప్రిల్ 6న మరో మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వెర్షన్ విడుదల చేశారు.

తెలుగు వెర్షన్‌ ఓటీటీ

ఇండియావైడ్‌గా సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే, అది మలయాళ వెర్షన్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఏప్రిల్ 12 నుంచి ప్రేమలు మలయాళ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది సదరు ఓటీటీ సంస్థ. దాంతో తెలుగు వెర్షన్‌ ఎప్పుడూ అనే ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేమలు తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్‌పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

ప్రేమలు డిజిటల్ ప్రీమియర్

ప్రేమలు ఓటీటీ తెలుగు వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అదే ఏప్రిల్ 12 నుంచి ఆహాలో ప్రేమలు సినిమాను తెలుగులో ప్రసారం చేయనున్నట్లు తాజాగా ఆహా సంస్థ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా షేర్ చేసింది. "ఇయ్యా.. ది మచ్ లవ్‌డ్ మూవీ ప్రేమలు ఆహాలో వచ్చేస్తోంది. మోడ్రన్ లవ్ ఫీస్ట్‌గా రెడీగా ఉండండి గాయ్స్. ఏప్రిల్ 12 నుంచి ప్రేమలు డిజిటల్ ప్రీమియర్ కానుంది" అని ఆహా టీమ్ రాసుకొచ్చింది. దాంతో పాటు షేర్ చేసిన పోస్టర్ అట్రాక్టివ్‌గా ఉంది.

నిర్మాణ రంగంలోకి

ఇదిలా ఉంటే, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ రీసెంట్‌గా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టాడు. ప్రముఖ బ్యానర్స్‌పై ప్రేమలు చిత్రాన్ని కార్తికేయ తెలుగు ప్రేక్షకులు అందించారు. ఇక్కడ కూడా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. రోజు రోజుకీ ఈ సినిమా తెలుగు వెర్షన్ కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి. ఈ బ్లాక్ బస్టర్ విజయం అందించిన నమ్మకంతో కార్తికేయ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.

సమర్పకుడిగా జక్కన్న

బాహుబలి వంటి సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ అర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలిసి కార్తికేయ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రూపొందించనున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌ రూపకల్పనలో కార్తికేయతో నిర్మాత శోభు యార్లగడ్డ చేతులు కలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

IPL_Entry_Point