Manjummel Boys: కమల్ హాసన్ పాటకు ట్రిబ్యూట్‌గా మంజుమ్మల్ బాయ్స్.. ఆయనతో సినిమా: డైరెక్టర్
Manjummel Boys Director About Kamal Haasan: కమల్ హాసన్ సినిమాలోని ఓ పాటకు ట్రిబ్యూట్‌గా మంజుమ్మల్ బాయ్స్ సినిమా అని చెప్పొచ్చు అని మూవీ డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువల్ తెలిపారు. అలాగే కమల్‌తో సినిమాలు చేయడంపై ఆసక్తికర ఆన్సర్స్ ఇచ్చారు.
Manjummel Boys Chidambaram Kamal Haasan: మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగు వెర్షన్ ఇవాళ అంటే మార్చి 6న ఏపీ, తెలంగాణలో విడుదలైంది. దీనికంటే ముందు రోజే పలు చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మంజుమ్మల్ బాయ్స్ సినిమాను దాదాపుగా 300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ చిదంబరం ఎస్ పొదువల్ ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చారు.
మూవీ కోసం సౌబిన్ షాహిర్, నిర్మాతలను ఎలా కన్విన్స్ చేశారు?
మంజుమ్మల్ బాయ్స్ రీసెర్చ్, రైటింగ్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి సౌబిన్ షాహిర్ నాతో ట్రావెల్ అయ్యారు. సో, ఆయన్ను కన్విన్స్ చేయడం కష్టం ఏమీ కాలేదు. ఆయన ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. కథలో స్పార్క్ ఆయన గుర్తించారు. అయితే మీరు చెప్పినట్టు రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు. కాకపోతే మాది పెద్ద సినిమాయే.
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ గురించి..
కేరళలో బెస్ట్ సినిమాటోగ్రాఫర్లలో షైజు కాలిద్ ఒకరు. ఆయన ఎన్నో బ్యూటిఫుల్ సినిమాలు చేశారు. మా సినిమాకు ఆయన వర్క్ చేయడం మా అదృష్టం. మ్యూజిక్ డైరెక్టర్ సుషిన్ శ్యామ్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఎక్కువ వాడలేదు. సర్వైవల్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఆర్ఆర్ ఇచ్చారు.
కమల్ హాసన్ పాటకు ట్రిబ్యూటా?
లోకనాయకుడు కమల్ హాసన్ గారి 'గుణ' సినిమాలోని 'కన్మణి అన్‌బోతు' పాటకు 'మంజుమ్మెల్ బాయ్స్' ట్రిబ్యూట్ అని చెప్పాలి. సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఆ సాంగ్ యూజ్ చేయాలని అనుకున్నాం. గుణ కేవ్స్ అంటే ముందుగా 'కన్మణి..' సాంగ్ గుర్తొస్తుంది. ఫ్రెండ్షిప్ స్టోరీకి సెట్ అవుతుంది. అందుకే ఉపయోగించాం.
సినిమా చూసి కమల్ గారు ఏమన్నారు?
మా సినిమా టీమ్ అంతా కమల్ సార్ ఫ్యాన్స్. ఆయన్ను కలవడం మాకొక మేజికల్ మూమెంట్. 'నాకు సినిమా బాగా నచ్చింది' అని కమల్ సార్ చెప్పడం ఇంకా ఇంకా సంతోషం. అది పెద్ద అవార్డుతో సమానం. మమ్మల్ని ఆహ్వానించి, మాతో విలువైన సమయాన్ని గడిపిన కమల్ గారికి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.
కమల్ గారితో మీరు సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా?
కమల్ హాసన్ గారిని డైరెక్ట్ చేయాలనేది ప్రతి ఒక్క డైరెక్టర్ డ్రీం. ఆ అవకాశం వస్తే ఎవరు కాదంటారు. అంతేకాదు, ఆయనతో సినిమాలు చేసేందుకు చాలా ఐడియాస్ ఉన్నాయి. అయితే, రైటింగ్ పార్ట్ టఫ్ ప్రాసెస్. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పలేను.
మైత్రీ మూవీ మేకర్స్ గురించి..?
మైత్రీ మూవీ మేకర్స్ గురించి మలయాళంలో కూడా తెలుసు. 'పుష్ప' చేశారు కదా! మైత్రీ రవి గారితో నేను మాట్లాడాను. తెలుగులో ఆ సంస్థ ద్వారా సినిమా విడుదల కావడం నాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. మా సినిమాకు మంచి సపోర్ట్ దొరికింది. ఇంత కంటే బెస్ట్ నేను ఆశించలేను.