Pushpa 2: పుష్ప 2 నుంచి రష్మిక మందన్నా కొత్త పోస్టర్.. పట్టు చీరలో బర్త్ డే గర్ల్-rashmika mandanna look released from pushpa 2 on her birthday pushpa the rule ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2: పుష్ప 2 నుంచి రష్మిక మందన్నా కొత్త పోస్టర్.. పట్టు చీరలో బర్త్ డే గర్ల్

Pushpa 2: పుష్ప 2 నుంచి రష్మిక మందన్నా కొత్త పోస్టర్.. పట్టు చీరలో బర్త్ డే గర్ల్

Sanjiv Kumar HT Telugu
Apr 05, 2024 03:41 PM IST

Rashmika Mandanna Pushpa 2 Look: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుట్టినరోజు ఇవాళ (ఏప్రిల్ 5). ఈ సందర్భంగా ఆమె నటించిన సినిమాల నుంచి బర్త్ డే స్పెషల్‌గా పోస్టర్స్ విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా పుష్ప 2 నుంచి శ్రీవల్లి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

పుష్ప 2 నుంచి రష్మిక మందన్నా కొత్త పోస్టర్.. పట్టు చీరలో బర్త్ డే గర్ల్
పుష్ప 2 నుంచి రష్మిక మందన్నా కొత్త పోస్టర్.. పట్టు చీరలో బర్త్ డే గర్ల్

Rashmika Mandanna Look From Pushpa 2: శుక్రవారం (ఏప్రిల్ 5) రోజున నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప: ది రూల్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. పుష్ప ది రైజ్ మొదటి భాగంలో కోట్లకు పడగలెత్తిన పుష్ప రాజ్‌ను శ్రీవల్లి పెళ్లి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. కాబట్టి సెకండ్ పార్ట్‌లో శ్రీవల్లి పుష్ప రాజ్‌కు భార్యగా కనిపించనుంది. పుష్ప రాజ్‌ రేంజ్‌కు తగినట్లే శ్రీవల్లి ఉంటుందన్నట్లుగా రిలీజ్ చేసిన తాజా పోస్టర్ ద్వారా చూపించారు.

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రష్మిక మందన్నా ఆకుపచ్చ సిల్క్ చీరలో అత్యంత ఖరీదైన ఆభరణాలు వేసుకుని, మెడలో నల్లపూసలతో ఎంతో అందంగా కనిపించింది. చేతి వేళ్ల మధ్య నుంచి ఒక కన్నుతో తీక్షణంగా చూస్తున్న రష్మికను ఇందులో మనం చూడొచ్చు. అయితే, ఈ స్టిల్ ఓ పాటలోనిదిలా అనిపిస్తోంది. పుష్ప 2 నుంచి విడుదలైన రష్మిక మందన్నా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

రష్మిక బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కాబట్టి అందులో అల్లు అర్జున్ లేడు. కేవలం శ్రీవల్లిని మాత్రమే చూపిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌పై అభిమానులు, నెటిజన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. 'ఒక్కక్క పోస్టర్ డైమండ్ బ్రో (ప్రతి పోస్టర్ ఒక వజ్రం)' అంటూ ట్విట్టర్‌లో కామెంట్ చేస్తున్నారు. "పుష్ప మొదటి భాగానికి భిన్నంగా శ్రీవల్లి చాలా ఇంట్రెస్టింగ్‌గా, డిఫరెంట్‌గా ఉంది" అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

అలాగే రష్మిక మందన్నాను ట్యాగ్ చేస్తూ "ఏప్రిల్ 8న టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం'' అని మరొకతను చెప్పుకొచ్చాడు. "అద్భుతమైన, ప్రతిభావంతులైన నటి రష్మిక మందన్నాకు జన్మదిన శుభాకాంక్షలు" అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. "రాబోయే రోజుల్లో మీరు మరిన్ని విజయాలను పొందుతారు. భగవంతుడు మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, శాంతి, సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్న" అని ఓ యూజర్ తన అభిమానం చూపించాడు.

కాగా పుష్ప 2 కంటే ముందు రష్మిక మందన్నా నటిస్తున్న మరో సినిమా ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కూడా కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాను హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ చేస్తున్నారు. ఇదివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్ ఎంతగానో ఆకట్టుకుంది. అందులో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెబుతుంటుంది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో హీరోగా దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే, రష్మిక మందన్నా చివరిసారిగా రణబీర్ కపూర్‌తో కలిసి యానిమల్ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. దీనికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆమె రణ్ బీర్ భార్యగా నటించింది. ఇక ఇటీవలే పుష్ప ది రూల్ టీజర్ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 రూల్ టీజర్ ఏప్రిల్ 8న రిలీజ్ కానుందని, పుష్ప రాజ్ డబుల్ ఫైర్‌తో వస్తున్నాడని మేకర్స్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన ప్రకటనతో టీజర్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 మూవీ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IPL_Entry_Point